అన్ లాక్ 1.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు భారీ సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నిబంధనల సడలింపుల వల్ల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు తెరచుకున్నాయి. రోడ్లపై జనసంచారం పెరగడంతో వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. పరిస్థితి ఇంత తీవ్రంగా వున్నా జనంలో మాత్రం సీరియస్ నెస్ కనిపించకపోవడం గమనార్హం. 
 
నగరాలు, పట్టణాల్లో జనం లక్షల సంఖ్యలో గుమికూడుతున్నారు. రోడ్లపైకి లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా జనం వస్తూ ఉండటంతో వేగంగా కరోనా వ్యాపించడం ఖాయమని వైద్య నిపుణులు చెబుతున్నారు. . కరోనా వైరస్‌ను కట్టడి చేయడమన్నది ఇప్పుడు ప్రభుత్వాలకు సవాల్ గా మారింది. ప్రజలు మాస్క్ లు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడంతో ఇంకెన్ని కేసులు బయటపడతాయోననే భయం అధికారుల్లో పెరుగుతోంది. 
 
ప్రతిరోజూ తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ సర్కార్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో మరోసారి కఠినంగా లాక్ డౌన్ అమలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు, అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసులు మాత్రం తగ్గడంలేదు. అన్ లాక్ 1.0 అమలులోకి వచ్చిన రోజు నుంచి దేశంలో కూడా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. 
 
దేశంలో గడచిన 24 గంటల్లో 11,929 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 1,62,379 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా 1,49,348 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 9195 మంది కరోనా భారీన పడి ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో నమోదైన కేసులతో కరోనా కేసుల సంఖ్య 3,20,922కు చేరింది. దేశంలో కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: