ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతలు వరుసగా అరెస్ట్ లు కావటం ఏపీ రాజకీయాలని కుదిపేస్తోంది. మొన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి వరుస అరెస్టులతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ అరెస్టులు చేస్తోందని తాజా పరిస్థితుల బట్టి టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మరోపక్క అధికారంలో ఉన్న వైసీపీ నేతలు చేసిన అవినీతికి తగిన విధంగా టీడీపీ నాయకులు అరెస్ట్ అవుతున్నారని అంటున్నారు.

IHG

ఇదిలా ఉండగా తాజా పరిస్థితులపై పార్టీ కార్యకర్తలతో క్యాడర్ తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో చంద్రబాబు షాకింగ్ కామెంట్లు చేశారు. టీడీపీలో ప్రజాదరణ కలిగిన నాయకులను జగన్ టార్గెట్ చేశారని అందరూ జాగ్రత్తగా ఉండాలి అన్నట్టుగా బాబు వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రజాదరణ ఉన్న రాజకీయ కుటుంబాలపై అధికారంలో ఉన్న జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

IHG

వైసీపీ పార్టీలో చేరితే వ్యాపారాలపై వేసిన ఫైన్ లు రద్దు చేస్తున్నారని కోర్టు తీర్పు లతో సీఎం జగన్ అసహనంతో ఉన్నారని వీడియో కాన్ఫరెన్స్ లో షాకింగ్ కామెంట్ చేశారు. అంతేకాకుండా నేరస్థుడు పాలకుడు అయితే నిరపరాధులు జైల్లో ఉంటారని, అదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజమవుతుందని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా అనేక విషయాల గురించి చంద్రబాబు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించి, టీడీపీ నాయకులు అంతా కలిసికట్టుగా ఉండాలని బాబు సూచించినట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: