తెలుగుదేశం పార్టీకి నాలుగు దశాబ్దాల చరిత్ర ఉంది. మూడు సార్లు చంద్రబాబు, మరో మూడు సార్లు ఎన్టీయార్ ఆ పార్టీకి ముఖ్యమంత్రులు అయ్యారు. దాదాపు 22 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. జాతీయ స్థాయిలో మూడు సార్లు చక్రం తిప్పింది. అటువంటి టీడీపీ పని అయిపోయిందని అంటే అది షాకింగ్ లాంటి స్టేట్మెంటే.

 

అటువంటి భారీ స్టేట్మెంట్ ని మెగా బ్రదర్, జనసేన నాయకుడు నాగబాబు ఇచ్చారు. ఆయన ఒక చానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ తెలుగుదేశం ఎక్కడ ఉందంటూ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ మునిగిపోయిందని కూడా బాంబు పేల్చారు. టీడీపీ చేసిన విచ్చలవిడి అవినీతి మూలంగా జనం ఆ పార్టీని మూలన పెట్టేశారని నాగబాబు అంటున్నారు.

 

2024 ఎన్నికల్లో పోటీ ప్రధానంగా వైసీపీకి జనసేనకు మధ్యనే ఉంటుందని అంటున్నారు. బీజేపీతో కలసి జనసేన ఆ ఎన్నికలను  ఎదుర్కొంటుందని కూడా చెప్పుకొచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచి పవన్ ఏపీకి సీఎం అవుతారని తాను గట్టిగా నమ్ముతున్నట్లుగా కూడా నాగబాబు అంటున్నారు.

 

ఇవనీ ఎలా ఉన్నా ఏపీలో టీడీపీ సీన్ కాలిందని  నాగబాబు అనడమే చిత్రం. ఓ వైపు నాదెండ్ల మనోహర్ అయితే అచ్చెన్నాయుడు అరెస్ట్ కి మద్దతు ఇవ్వకుండా అలాగని మానకుండా నానా కష్టాలు పడిన ప్రెస్ నోట్ కళ్ల ముందే ఉంది. అంటే నాగబాబు తప్ప పవన్, మనోహర్ లకు ఇంకా టీడీపీ బలంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆ పార్టీ లైన్ నే తీసుకున్నట్లుగా  డౌట్లు వస్తున్నాయి కూడా.

 

కానీ నాగబాబు మాత్రం రాజకీయాలు దాటి ముందుకు వచ్చి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతున్నారని పేరు తెచ్చుకున్నారు. మరో వైపు పవన్  మాత్రం ఇప్పటిదాకా టీడీపీని అసలు విమర్శించలేదని కూడా గుర్తు చేస్తున్నారు. ఏమో 2024 నాటికి టీడీపీ, జనసేన, బీజేపీ కలసి పోటీ చేయవచ్చునేమో. నాగబాబు అన్నట్లుగా టీడీపీఎని చంద్రబాబు క్లోజ్ కానిస్తారా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: