ఇండియా పాక్ మధ్య విబేధాల సంగతి కొత్త కాదు కదా. ఇండియాలో ఏదో రకంగా తీవ్రవాదాన్ని పెంచి పోషించాలని పాక్ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇందుకు తన సరిహద్దుల్లోని పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను ఉపయోగించుకుంటుంది. అందుకే ఆ మధ్య ఇండియా సర్జికల్ స్ట్రయిక్స్ చేసి ఉగ్రవాదుల పీచమణిచింది. ఒక దశలో ఇండియా పాక్ మధ్య యుద్ధం తప్పదేమో అన్నంతగా సీన్ ముదిరింది.

 

 

కానీ ఆ తర్వాత క్రమంగా ఉద్రిక్తతలు చల్లబడ్డాయి. అయితే తాజాగా ఇండియా చేసిన ఓ ప్రకటన పాక్ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఇంతకీ భారత్ ఏమందంటే.. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు భారత్‌లో విలీనం కావాలని భావిస్తున్నారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులు ఆగండి... పీవోకే ప్రజలు భారత్‌లో విలీనం అయిపోతామని డిమాండ్ లేవనెత్తుతారు, పాకిస్తాన్ ఏలుబడిలో ఉండమని కరాఖండిగా చెబుతారు. ఇలా జరిగిన రోజు పార్లమెంట్ లక్ష్యం నెరవేరినట్లు అంటూ అమిత్ షా షాకింగ్స్ కామెంట్స్ చేశారు.

 

 

ఇప్పటికే మోడీ- అమిత్ షా ద్వయం ఎన్నో సాహసాలు చేసింది. ఆర్టికల్ 371ను రద్దు చేసేసింది. కాశ్మీర్ స్వయంప్రతిపత్తిని ఎత్తేసింది. అంతేనా.. కాశ్మీర్ ను రెండు ముక్కలు చేసింది. ఇలాంటి సాహసాలు చేసిన మోడీ - అమిత్ షా ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను సొంతం చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు కొన్నాళ్ల నుంచి టాక్ వస్తోంది. అమిత్ షా తాజా చాప కింద నీరులా అందుకు వ్యూహాలు కూడా రెడీ అవుతున్నాయేమో అనిపించకమానదు.

 

 

ఎప్పటికైనా ఆక్రమిత కాశ్మీర్ ను ఇండియాలో భాగం చేయాలన్నది బీజేపీ చిరకాల వాంఛ. అయితే అందుకు యుద్ధం చేస్తే.. అది అణుయుద్ధం వరకూ దారి తీసే ప్రమాదం ఉంది. అయితే మనస్సు ఉంటే మార్గం ఉంటుందని అమిత్ షా - మోడీ జోడి ఇప్పటికే అనేక విషయాల్లో నిరూపించింది. మరి పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలోనూ మరోసారి ఆ నానుడి నిజం చేస్తారా.. చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: