మోడీ దేశానికి ప్రధాని, చరిష్మాటిక్ లీడర్. ఆయన దేశంలో మూడు దశాబ్దాల పాటు ఉన్న సంకీర్ణ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఫుల్ మెజారిటీతో 2014 ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తెచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో దాని కంటే ఎక్కువ మెజారిటీ బీజేపీకి దక్కినిది. ఓ విధంగా విపక్ష రాజకీయానికి మోడీ భారీగానే చెక్ పెట్టారు.

 

మరి మోడీ జనాదరణ 2014 లో ఏపీలో పనిచేసింది. 2019 ఎన్నికల్లో మాత్రం బీజేపీకి కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదు. పైగా నోటా కంటే తక్కువ ఓటింగ్ శాతం వచ్చింది. అదే వైసీపీ ఏపీలో బంపర్ మెజారిటీతో గెలిచింది. మోడీ వల్లనే జగన్ గెలిచారని టీడీపీలోనే కాదు, జనసేనలోనూ ఒక చర్చ ఉంది. అందుకే ఓడిన ఎనిమిది నెలలకే బీజేపీతో పవన్ జట్టు కట్టేశారు. మోడీ అండదండలు ఉంటే రేపటి ఎన్నికల్లో ఏపీ సీఎం పీఠం తమదేనని కూడా నాగబాబు సహా నేతలు  గట్టిగా భావిస్తున్నారు కూడా. అయితే మోడీ 2019 ఎన్నికల్లో ఏపీలో తన బీజేపీ తరఫునే ప్రచారం చేసుకున్నారు కానీ జగన్ కి కాదుగా.

 

అదే విధంగా ఏపీలో బీజేపీకి ఎపుడు డజన్ సీట్లు మించి రాలేదు. ఏపీలో 175 సీట్లు ఉంటే రాయలసీమలో ఆ పార్టీకి గట్టి పునాదులు లేవు. కోస్తాలో టీడీపీకి వైసీపీకి బలం ఉంది. ఇక గోదావరి జిల్లాల్లో జనసేనకు బలం కొంత ఉండొచ్చు. అయినా అక్కడ కూడా వైసీపీ,టీడీపీ గట్టిగానే ఉన్నాయి.  ఉత్తరాంధ్రాలో మళ్ళీ వైసీపీ టీడీపీల మధ్య గట్టి పోటీ ఉంది. ఇక్కడ కూడా జనసేన ఉనికి చాటుకునే అవకాశాలు ఉండొచ్చు.

 

బీజేపీ విషయానికి వస్తే మొత్తం ఈ రీజనల్ సెగ్మెంట్లలో ఎక్కడ చూసినా గట్టిగా ఈ సీటు నాది అని చెప్పుకోవడానికి లేదు. బలం కూడా ఫలనా చోట ఉంది అని చెప్పడానికి లేదు. అయితే జనసేన నాయుకులు బీజేపీతో కలిపి 2024లో అధికారం మాదేనని అంటున్నారు దానికి పొలిటికల్ బేస్ ఏంటి అంటే వైసీపీ అయిదేళ్ళ పాలన మీద విరక్తితో ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున జనాలు వచ్చి ఈ కూటమిలో కలుస్తారని, అలాగే టీడీపీ బలం తగ్గిపోయి ఆ పార్టీ నుంచి వచ్చి  జనాలు కలుస్తారని, ఆ విధంగా ఈ కూటమి బలంగా  ఉంటే ఏపీ జనాలు  ఆదరిస్తారని.

 

అయితే ఇక్కడో విషయం చెప్పాలి. ఏపీలో 2014 నాటికి వైసీపీకి 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 44 శాతం ఓటింగ్ షేర్ ఉంది. అలాగే ఇపుడు ఓడినా కూడా టీడీపీకి 40 శాతం ఓట్ల షేర్ ఉంది. 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక బీజేపీ, జనసేన ఓట్లు కలిపితే ఏడు శాతం అనుకున్నా సీటు ఒక్కటిగా చెప్పుకోవాలి. 

 

ఒక ప్రభంజనంగా 2024 ఎన్నికల్లో ఈ కూటమి దూసుకు  వచ్చినా కూడా యాభై శాతం ఓట్ల షేర్ ఉన్న వైసీపీని, నలభై శాతం ఉన్న టీడీపీని అధిగమించి ముందుకు సాగగలరా అన్నది ఒక ప్రశ్న. 2024 నాటికి ఈ కూటమి  రెండవ స్థానంలోకి వస్తే 2029 నాటికి ఈ కూటమికి చాన్స్ ఉంటుందేమో. 2024 నాటికి ఎంత కాదన్నా టీడీపీ రేసులో ఉంటుందన్నది విశ్లేషకుల భావన. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: