పండగలకు కరోనా కష్టాలు తప్పటం లేదు. ఉగాది, శ్రీరామనవమి పండుగలకు సందడి లేదు. ఇఫ్తార్ విందు లేకుండానే రంజాన్ గడిచిపోయింది. ఇప్పుడు వినాయక చవితి వస్తోంది. వినాయకుడు ఉత్సవాలు అంటే భారీ విగ్రహాలు మండపాల సందడి ఉంటుంది. మరియు ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఈ సారి భారీ విగ్రహాలు ఉంటాయా అనే డౌట్ ప్రతి ఒక్కరిలో నెలకొంది. మామూలుగా అయితే ఇప్పటికే ఆర్డర్ లతో రెడీ కావలసిన విగ్రహాల వ్యాపారాలు చాలా వరకు అయినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. లాక్ డౌన్ కారణంగా ప్రస్తుత పరిణామాలు బట్టి విగ్రహాలు తయారు చేసే కళాకారులు ఎక్కడికక్కడ తమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోవడంతో..తిరిగి రావటం కోసం మార్గాలు వెతుకుతున్న గాని లాక్ డౌన్ నిబంధనల వల్ల రాలేకపోతున్నారు. 

 

అన్ని దాటుకుని కళాకారులు విగ్రహాలు రూపొందించిన గాని, కొనే వారు ఉండరు అని… మండపాల ఏర్పాట్లకు ప్రభుత్వాల నుంచి అనుమతులు రావడం కష్టమనే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నారట. అసలు ఈ సారి వినాయక చవితి జరిగే అవకాశం లేదు అని చాలామంది భావిస్తున్నారు. ముఖ్యంగా గుంపులుగుంపులుగా ఉండేచోట వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో… కచ్చితంగా ప్రభుత్వం వినాయక చవితి ఉత్సవాల విషయంలో సరికొత్త నిబంధనలు అమలు చేసే అవకాశం ఉంటుందని నిర్వాహకులు కళాకారులు భావిస్తున్నారు. 

 

ఈ నేపథ్యంలో చాలా వరకు విగ్రహాలను తయారు చేసే కళాకారులు… ఈసారి పెద్దగా వ్యాపారం జరిగే అవకాశం లేదు అని ముందుగానే చేతులెత్తేసినట్లు సమాచారం. కరోనా ఎఫెక్ట్ కారణంగా ఈ ఏడాది మొత్తం ఈ విధంగానే ఉంటుందని ప్రజలు పండుగ జరుపుకునే వాతావరణంలో పరిస్థితులు లేవని భావిస్తున్నారు. ఏదిఏమైనా మునుపటి రోజులు రావాలంటే కరోనా వైరస్ వ్యాక్సిన్ రావాలి అని అప్పుడే ప్రజలలో భయం పోతుందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: