కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నేతలకు, కార్యకర్తలకు స్పష్టమైన సంకేతం ఇవ్వాలని అనుకుంటోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ నేతలలో కొందరు చంద్రబాబుకు అనుకూలంగా మరికొందరు జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కొందరు నేతలు మాత్రం బీజేపీకి మాత్రమే అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇలా పార్టీలో ఇతర ప్రాంతీయ పార్టీలకు అనుకూల నేతలు ఉండటం వల్ల పార్టీ రాష్ట్రంలో బలపడలేకపోతుంది. 
 
కొన్ని రోజుల క్రితం బీజేపీ అధినాయకత్వం ఇతర పార్టీలకు అనుకూలంగా వ్యవహరించడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని... రాష్ట్రంలో టీడీపీ, వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న జనసేన మద్దతు వల్ల ఇప్పటికే పార్టీకి ప్రయోజనం చేకూరుతోందని.... సర్వేల్లో కూడా ఆ దిశగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయని ఆ పార్టీ ప్రకటించింది. ఇప్పటికిప్పుడు అనుకూల ఫలితాలు రాకపోయినా భవిష్యత్తులో బీజేపీ జనసేన కూటమి ఏపీలో మంచి ఫలితాలు అందుకునే అవకాశం ఉంది. 
 
2024 ఎన్నికల సమయానికి టీడీపీ వైసీపీలకు బీజేపీ - జనసేన కూటమి గట్టి పోటీ మాత్రం ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ, వైసీపీలను వ్యతిరేకిస్తే మాత్రమే కూటమి ఆ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. అయితే కొందరు నాయకులు పార్టీ ఆదేశాలను పాటించకపోవడంతో బీజేపీ కొందరు నాయకులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పార్టీలో కీలక పాత్ర పోషించిన లక్ష్మీపతిరాజా లాంటి నేతలపై సైతం బీజేపీ చర్యలు తీసుకుంది. 
 
 
మరికొందరు నేతలకు మాత్రం నోటీసులు ఇచ్చి బీజేపీ సున్నితంగా మందలించింది. అయితే బీజేపీ లక్ష్మీపతిరాజాను పక్కన పెట్టేయడం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. 2024 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ఏపీలో ఎదగటానికి ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో గతంలో పెద్దగా గుర్తింపు లేని బీజేపీ పార్టీలో ఎదగటానికి గత రెండేళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తోంది. అయితే బీజేపీ సొంతపార్టీ కీలక నేతలను సస్పెండ్ చేసి ఏమని సంకేతం ఇవ్వాలనుకుందో తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: