ప్రధాని మోడీ మరోసారి ముఖ్యమంత్రులతో భేటీ పెట్టారు. మోడీ వస్తున్నరంటేనే అదొక టెన్షన్ అయిపోతోంది ఈ మధ్య. ఆయన మార్చి నెలలో అకస్మాత్తుగా వచ్చి జనతా కర్ఫ్యూ అనేశారు. ఆ తరువాత రెండు రోజులకే లాక్ డౌన్ అంటూ దేశవ్యాప్తంగా పెట్టేశారు.ఆ తరువాత వరసగా ప్రతి పది రోజులకూ మోడీ వీడియో సమావేశాలు ముఖ్యమంత్రులతో పెట్టడం, ఆ మీదట టీవీల ముందుకు వచ్చి లాక్ డౌన్ని పొడిగించడం అంతా చూశారు. ఇపుడు మళ్ళీ మోడీ సీఎంల తో భేటీ అంటే అంతా ఉత్కంఠగా ఉంది. మోడీ ఊరికే రారు కదా అని చర్చ కూడా మొదలైంది.

 

ఈసారి విశేషం ఏంటి అంటే మోడీ రెండు రోజుల పాటు దేశంలోని ముఖ్యమంత్రులందరితోనూ వీడియో మీటింగులు పెడుతున్నారు. అంటే దేశంలోని 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలతో ప్రధాని చాలా తాపీగా, కూలంకషంగా అన్ని విషయాలు చర్చిస్తారు అన్న మాట. ఒక్కో దేశంలో పరిస్థితి ఎలా ఉంది కరోనా కేసుల ప్రభావం ఎక్కడ ఎలా ఉంది. 

 

లాక్ డౌన్ సడలింపుల వల్ల వచ్చిన ముప్పు ఎక్కడ ఉంది. ఏ రాష్ట్రంలో  ఏ ఏ కారణాల వల్ల కేసులు పెరుగుతున్నాయి అన్నది కూడా డేటాను పూర్తిగా మోడీ తీసుకుంటారని అంటున్నారు. దీనివల్ల మళ్ళీ లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలా వద్దా అన్నది కూడా తెలుస్తుంది అంటున్నారు.

 

ఒక్కసారి దేశవ్యాప్తంగా చూసుకుంటే నాలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికంగా ఉన్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్ లో కరోనా మహమ్మారి ఒక్కలా ఊపేస్తోంది. అలాగే మరో పదహారు నగరాలను కూడా కేంద్రం గుర్తించింది అంటున్నారు. అందులో హైదరాబాద్ కూడా ఉందని చెబుతున్నారు. దీంతో మోడీ ముఖ్యమంత్రుల భేటీలో తీసుకునే నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా చర్చగా ఉంది.

 

ఆంధ్రాలో కూడా కేసులు బాగా పెరుగుతున్నాయి. అదే విధంగా కర్నాటకలోనూ, కేరళలోనూ కరోనా కేసులు బాగానే వస్తున్నాయి. అయితే ఈసారి లాక్ డౌన్ దేశవ్యాప్తంగా ఉండదని అంటున్నారు. ఎంపిక చేసిన ప్రాంతాలు, రాష్ట్రాలు, నగరాల్లోనే   లాక్ డౌన్ విధించి కఠినంగా అమలుచేస్తారని అంటున్నారు. చూడాలి మరి మోడీ రెండు రోజుల సమావేశం తరువాత కీలక ప్రకటన వస్తుందని అంతా భావిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: