జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాగ్దానాలు చేస్తూ  వాటిలో కొన్నింటిని నెరవేరుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. కానీ కొన్నింటి విషయంలో మాత్రం జగన్ సర్కార్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్లుగా తయారైంది అని అంటున్నారు విశ్లేషకులు. ఒకప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించడానికి టెండర్ను జిఎంఆర్ సంస్థ కు ఇవ్వడానికి వైసీపీ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. వైసిపి పార్టీ తో పాటు బిజెపి పార్టీ కూడా అప్పట్లో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి జిఎంఆర్ కి ఇవ్వడానికి తప్పుబట్టింది. వాళ్లకి తప్ప ఇంకెవరికైనా టెండర్స్ ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. 

 


 కానీ ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి సర్కార్ అదే జిఎంఆర్ సంస్థ కు  భోగాపురం ఎయిర్పోర్ట్ అప్పజెప్తున్నారు. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ జీఎంఆర్ కు  అప్పజెప్పడం సరైనదే అని అంటున్నారు విశ్లేషకులు. ఇలాంటి విషయంలో జిఎంఆర్ మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది అని అంటున్నారు. కానీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే జిఎంఆర్ కంపెనీని వ్యతిరేకించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం వారినే పిలిచి  మరి ఎలా టెండర్లు ఇస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. 

 


 కానీ ప్రస్తుతం జగన్ సర్కార్ వినిపిస్తున్న వాదన ఏమిటంటే గతంలో చంద్రబాబు ప్రభుత్వం 2700 ఎకరాలు జిఎంఆర్ కంపెనీకి ఇచ్చేందుకు నిర్ణయించగా ప్రస్తుత ప్రభుత్వ  2200 ఎకరాలు మాత్రమే ఎయిర్ పోర్టు కోసం అప్పగించిందని మిగతా ఐదు వందల ఎకరాలను సేవ్ చేసి పదిహేను వందల కోట్లు మిగిల్చింది  అనే ఒక సమాధానం చెబుతున్నారు. గతంలో ఎయిర్ పోర్టు అథారిటీ వద్దని ఓపెన్గా టెండర్లు పిలవాలని.. జిఎంఆర్ సంస్థ ను వ్యతిరేకించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. కాని ప్రస్తుతం మాత్రం అదే కంపెనీకి  బాధ్యతలు అప్పగించి దానిని కవర్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: