బిజెపి కూడా ఇప్పుడు లైన్ లోకి వస్తోంది. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలను పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకుని, తమ సత్తా చాటుకోవాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. జగన్ దూకుడు చూస్తుంటే, టీడీపీని నామ రూపాలు లేకుండా చేయాలని బలంగా డిసైడ్ అయినట్టు గా కనిపిస్తున్నారు. ఇదే విషయాన్ని బిజెపి గ్రహించింది. వాస్తవంగా అయితే తెలుగుదేశం పార్టీపై వైసిపి కక్ష సాధిస్తుందని, ఆ పార్టీపై విమర్శలు చేసి టీడీపీ తో కలిసి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించాలి. కానీ ఇప్పుడు బిజెపి ఆ విధంగా చేయకుండా, టిడిపి పై తమ వంతు విమర్శలు చేస్తూ, మరింత కాక పెంచుతోంది. బిజెపి ఆకస్మాత్తుగా ఈ స్టాండ్ తీసుకోవడం వెనుక కారణం ఎవరికీ అంతుపట్టలేదు. ఇక్కడే బిజెపి తన తెలివితేటలకు పదును పెట్టింది.

IHG


 ప్రస్తుతం అధికార పార్టీగా వైసీపీ ఉంది. వైసిపి కాకపోతే టిడిపి అధికారంలోకి వస్తుంది. కానీ కేంద్ర అధికార పార్టీగా జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్న బీజేపీ పరిస్థితి ఏపీలో అంతంతమాత్రంగా ఉండటంతో ఇక పై  టిడిపి స్థానాన్ని ఆక్రమించాలని బిజెపి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. టిడిపి బలహీనం అయితేనే, తాము బలపడవచ్చు అనే విషయాన్ని బీజేపీ గుర్తించింది. అందుకే టిడిపిపై ఇప్పుడు బీజేపీ నేతలు విమర్శలు చేస్తూ హడావుడి చేస్తున్నారు. తాజాగా ఏపీ పాలిటిక్స్ లో హీట్ పెంచేందుకు బిజెపి జాతీయ స్థాయి నాయకుడు రామ్ మాధవ్ ను మళ్లీ యాక్టివ్ చేసినట్లుగా కనిపిస్తోంది. ఏపీ వ్యవహారాల ఇంచార్జీగా ఉన్న సునీల్ దేవధర ఇప్పటికే పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

 

IHG


 ఇప్పుడు రామ్ మాధవ్ ను బీజేపీ రంగంలోకి దించి అధికార వైసిపి, విపక్ష టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, అసలు సిసలైన ప్రతిపక్షం బిజెపి అన్నట్టుగా వ్యవహరిస్తోంది. టిడిపి ప్రభుత్వ హయాంలో నెలకొన్న తప్పిదాలను ఇప్పుడు బిజెపి తెరపైకి తెస్తోంది. అలాగే వైసీపీ ప్రభుత్వానికి కేంద్రం చేసిన సహాయంపైన, బిజెపి ప్రజలకు అర్థమయ్యే విధంగా లెక్కలతో సహా క్లారిటీ ఇస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: