అధికారం కోల్పోయిన దగ్గర నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు అసలు ఖాళీగా ఉండకుండా...జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. జగన్ సీఎం పీఠం ఎక్కిన దగ్గర నుంచి బాబు అదే పనిలో బిజీగా ఉన్నారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్న వ్యతిరేకిస్తున్నారు. ఏ పథకం అమలు చేసిన దానిపై విమర్శలు చేస్తున్నారు. ఇంకా పలు అంశాల్లో ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు.

 

సరే ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఇలా చేయడంలో తప్పులేదు. కానీ చంద్రబాబు చేసే పోరాటాలు ప్రజలని మెప్పించేలా ఉంటున్నాయా? అంటే లేదనే చెప్పాలి. ఇప్పటికీ ప్రజలు జగన్ పట్ల నమ్మకంతోనే ఉన్నారు. ప్రజలు ఎలాగో పట్టించుకోవడం లేదనుకుంటే, సొంత పార్టీ నేతలు సైతం బాబుకు సపోర్ట్ ఉండటం లేదు. ఏదో కొందరు నేతలు మాత్రమే బాబుకు మద్ధతు ఇస్తున్నారు. ఇటీవల టీడీపీ నేతల అరెస్ట్ విషయంలో కూడా బాబు అండ్ బ్యాచ్ ఆందోళనలు చేస్తూ, జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.

 

అయితే బాబు చేసే ఆందోళనలకు చాలామంది నేతలు మద్ధతు ఇవ్వడం లేదు. ముఖ్యంగా బాబుకు ఎక్కువ సపోర్ట్ ఉండే కృష్ణా జిల్లా టీడీపీ నేతలు ఈ మధ్య యాక్టివ్‌గా ఉండటం లేదు. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిలు అరెస్ట్ జరిగితే చంద్రబాబుతో సహ పలువురు నేతలు నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. అయితే విజయవాడ టీడీపీ నేతలు మాత్రమే బాబుకు సపోర్ట్‌గా ఉన్నారు. బోండా ఉమా, బుద్దా వెంకన్న, కొల్లు రవీంద్రలు ఎక్కువగా బాబుకు అండగా ఉంటున్నారు. అటు కేశినేని నాని, గద్దె రామ్మోహన్‌, జవహర్‌లు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. అటు నందిగామ, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, శ్రీరామ్ తాతయ్యలు కూడా పార్టీలో యాక్టివ్‌గానే ఉన్నారు.

 

ఇక పామర్రు మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, అవనిగడ్డ మండలి బుద్దప్రసాద్, కైకలూరు జయమంగళ వెంకటరమణ, గుడివాడ రావి వెంకటేశ్వరరావు, నూజివీడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావులు అసలు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. మొత్తానికైతే జగన్ దెబ్బకు తెలుగు తమ్ముళ్లలో ఊహించని మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇబ్బంది పడాలి వస్తుందేమో అని తమ్ముళ్ళు ఇలా మారిపోయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: