ఏ ముహూర్తంలో 2020 సంవత్సరంలో అడుగు పెట్టామో కానీ.. జీవితంలో ఎప్పటికీ మర్చిపోలని విధంగా ఉంది.. అదీ మనం బతికి ఉంటే.   అమెరికాలో అయితే కరోనా కరాళ నృత్యం చేస్తుంది. ప్రపంచంలో మూడో వంతు మరణాలు, కేసులు ఇక్కడే ఉన్నాయి.   కరోనా ప్రభావిత దేశంగా బ్రెజిల్ ఉంది అక్కడ 867,882 కేసులు నమోదు కాగా, 43,389 మంది మరణించారు. మూడో స్థానంలో రష్యా ఉండగా 5,28,964 మంది ఉండగా 6,948 మంది మృతి చెందారు. ఇక కరోనా కేసుల్లో నాల్గవ స్థానంలో భారత్ ఉంది. ప్రస్తుతం 3,32,424 కేసులు నమోదు కాగా 9,520 మంది మరణించారు. అయితే ప్రస్తుతం భారత్ లో 50.60శాతం కేసులు రికవర్ కావటం కాస్త ఊరట అయినా కేసులు పెరుగుతుండటం మాత్రం ఆందోళన కలిగిస్తుంది. 

 

భారత్ లో మార్చి నుంచి లాక్ డౌన్ మొదలు  పెట్టారు.. దాంతో ఇక్కడ అన్ని వ్యవస్థలు మూసి వేసిన విషయం తెలిసిందే. దాంతో జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇక ఈ దరిద్రంతోనే ఛస్తున్నామంటే.. పాక్ నుంచి మిడతల దండు వచ్చి పడింది. పండిన పంట మొత్తం ఊడ్చేస్తున్నాయి. ఇది భవిష్యత్ లో ఆహార కొరతకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇది చాలాదన్నట్లు అంఫాన్, నిసర్గ తుఫాన్ల వల్ల లక్షల్లో నష్టాలు వచ్చి పడ్డాయి. అంతే కాదు ఈ మద్య భూకంపాల గొల ఒకటి మొదలైందని అంటున్నారు.

 

ఇటీవల ఢిల్లీలో వరుసగా భూకంపాలు వచ్చాయి.. దాంతో ప్రజలు గుండెల్లో గుబులు పుట్టింది. గుజరాత్ రాష్ట్రంలో వరుసగా రెండు సార్లు ఈ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు అయోమయంలో పడిపోయారు. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.5గా నమోదైనట్టు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ అధికారులు వెల్లడించారు. రాజ్‌కోట్‌కు వాయువ్యంగా 118 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఇలా ఓ వైపు కరోనా మరోవైపు భూకంపాలతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: