చంద్రబాబు దారుణంగా ఓడిపోవడానికి గల కారణాల్లో దుబారా ఒకటన్న సంగతి తెలిసిందే. ఆ ఐదేళ్లు బాబు ప్రభుత్వం ఎంత దుబారా ఖర్చు చేసిందో చెప్పాల్సిన పనిలేదు. ప్రతి పనికి హడావిడి చేసేవారు.  ఆఖరికి వాటర్ బాటిల్ విషయంలో భారీగా ఖర్చు చేశారు. పోలవరం సహ పలు ప్రాజెక్టుల విషయంలో కూడా దుబారా చేసింది.  అటు విద్యుత్ కొనుగోలు విషయంలో బాబు ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు పెట్టింది. అప్పులు చేసింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక...టోటల్‌గా చంద్రబాబుకు రివర్స్‌లో వెళుతున్నారు.

 

బాబు దుబారాతో ముందుకెళితే...జగన్ పొదుపు మంత్రంతో ముందుకెళుతున్నారు. ప్రతి విషయంలోనూ పొదుపు మంత్రం పాటించారు. ప్రాజెక్టుల కాంట్రాక్టుల విషయంలో రివర్స్ టెండరింగ్‌కు వెళ్ళి వందల కోట్లు ఆదా చేశారు. అలాగే ప్రభుత్వం తరుపున పెద్దగా హడావిడి కార్యక్రమాలు చేయకుండా, తక్కువలోనే తేల్చేస్తున్నారు. ఆఖరికి ప్రభుత్వ సమావేశాల్లో పెట్టే వాటర్ బాటిల్స్‌ కూడా తక్కువ రేటువే ఉండేలా చూసుకున్నారు.

 

అలాగే విద్యుత్ కొనుగోలు విషయంలో కూడా జగన్ వేల కోట్లు ఆదా చేశారు. ఈ ఏడాది కాలంలో విద్యుత్ రంగంలో జగన్ తీసుకున్న చర్యలు వల్ల మంచి ఫలితాలని ఇచ్చాయి. విద్యుత్ కొనుగోలు విషయంలోనే రూ.700 కోట్లు సేవ్ చేశారు. టీడీపీ హయాంలో సగటున యూనిట్‌ విద్యుత్‌ రూ.7 చొప్పున కొనుగోలు చేయగా ఈ ఏడాది యూనిట్‌ రూ.1.63 నుంచి రూ.2.80కి మించకుండా కొనుగోలు చేశారు. ఈ  చర్య వల్లే 700 కోట్లు ఆదా అయింది. ఇక చంద్రబాబు అధికారంలో ఉన్న 2018-19 ఏడాదిలో విద్యుత్ సంస్థల మొత్తం వ్యయం రూ. 48,110 కోట్లు కాగా, దాన్ని జగన్ అధికారంలోకి వచ్చాక 2019-20లో రూ. 43, 327 కోట్లకు ప్రభుత్వం తగ్గించారు. దీని వల్ల 4వేల 783 కోట్లు ఆదా అయింది.

 

ఇక దీని వల్ల బాబు హయాంలో చేసిన అప్పులకు కట్టాల్సిన వడ్డీ భారం తగ్గనుంది. ఈ మిగిలిన డబ్బులు వడ్డీ కట్టడానికి సరిపోతాయి. ఈ విధంగా జగన్ దుబారాని తగ్గించి, 4 వేల కోట్లకి పైనే ఆదా చేసి రాష్ట్రానికి చాలా మేలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: