క‌రోనా వైర‌స్‌.. ఎక్క‌డో చైనాలో మొద‌లైన ఈ మ‌హ‌మ్మారి దండ‌యాత్ర ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొన‌సాగుతూనే ఉంది. వ్యాక్సిన్ లేని ఈ మ‌హ‌మ్మారికి అడ్డుక‌ట్ట వేసేందుకు దేశ‌దేశాలు తీవ్ర ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ క‌రోనా దూకుడు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. రోజుల తరబడి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నా.. ఆ ప్రాణాంతక వైరస్ నాశ‌నం కావ‌డంలేదు. మ‌రోవైపు లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌జ‌లంద‌రూ ఇంటికే పరిమితమైంది. ఈ క్రమంలోనే కొందరికి తినేందుకు తిండిలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. 

 

ప‌ని లేక ఇళ్లకే పరిమితమైన పేదప్రజలు జానెడు పొట్ట నింపుకునేందుకు నానా అవస్తలు పడుతున్నారు. అయితే ఈ లాక్‌డౌన్ వేళ కొన్ని ల‌క్ష‌ల అబార్ష‌న్స్ జ‌రిగాయ‌ని తాజాగా స‌ర్వేలో తేలింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఐపాస్ డెవలప్ మెంట్ ఫౌండేషన్ సంస్థ తాజాగా నిర్వహించిన సర్వే లో ఆశక్తికర విషయాలను వెల్లండించింది. లాక్ డౌన్ సమయంలో అంటే మార్చి 25 నుంచి మే 3 వరకు విధించిన కారణంగా మొత్తం 18.5 లక్షల అబార్షన్‌లు జ‌రిగాయ‌ని వెల్ల‌డించింది. అది కూడా గైనకాలజిస్ట్‌ సలహా లేకుండానే జరిగాయని సర్వేలు స్ప‌ష్టం చేశాయి.

 

మహిళలల్లో సురక్షిత, చట్టబద్ధమైన అబార్షన్ల గురించి అవగాహన కల్పించే ఐపాస్‌ డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్ నిర్వ‌హించిన ఈ స‌ర్వేలో లాక్‌డౌన్‌ మొదటి మూడు దశల్లో మహిళలకు అందిన వైద్య సౌకర్యాలపై దృష్టి పెట్టింది. అందులో లాక్‌డౌన్‌1, 2 దశల్లో అంటే మార్చి 25 నుంచి మే 3 వరకు 59 శాతం మహిళలు అబార్షన్‌ చేయించుకోవటానికి ఆస్పత్రికి వెళ్లగా..అక్కడ డాక్టర్లని కలవటం కుదరలేదని తేలింది. కానీ అన్‌లాక్‌ దశలో ఈ సంఖ్య 33 శాతానికి తగ్గిందని సర్వేలో తేలింది. కాగా, కరోనా మహమ్మారిగా మారినందున వైద్య సిబ్బంది పూర్తి శ్రద్ధ, కృషి వైరస్ నియంత్రణ మీదనే ఉంది. ఫలితంగా మిగతా వైద్య సేవలు, ముఖ్యంగా సురక్షితమైన గర్భస్రావం వంటి సేవలకు అంతరాయం కలిగింది ఫౌండేషన్ సీఈఓ వినోజ్‌ మానింగ్‌ తెలిపారు.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: