కరోనా వైరస్ రాకతో పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. ప్రపంచం గతంలోలాగా లేకుండా పోయింది. ఒకే ఇంటిలో బతుకుతూనే దూరం దూరంగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటినుండి వెళ్ళి బయటినుండి వస్తే చాలు ఆ మనిషిని చాలా విచిత్రంగా దూరం పెట్టే విధంగా చూసే పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కారణం మహమ్మారి కరోనా వైరస్. గుంపులు గుంపులు గా ఉండే చోటా ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం దేశంలో స్కూల్స్ మరియు కాలేజీస్ అదేవిధంగా సినిమా హాల్స్ ఓపెన్ చేయడానికి ఒకటికి పది సార్లు ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి.

IHG

ఇదిలా ఉండగా వైరస్ ప్రభావం పెళ్లిళ్లపై బాగా పడింది. వైరస్ రాకతో పెళ్ళికి కనీసం యాభై మందికి మించి బంధువులు ఉండకూడదని ప్రభుత్వాలు ఆంక్షలు మార్గదర్శకాలు జారీ చేయటంతో చాలా పెళ్లిళ్లు బోసిపోతున్నాయి. ఒకానొక టైంలో పెళ్లిళ్లు అంటే హంగులు, ఆర్భాటాలు, మేళతాళాలు, బంధు వర్గాలు సంతోషకరమైన వాతావరణంలో జరిగేవి. కానీ ఇపుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

IHG

కరోనా వైరస్ రాకతో కొద్ది మంది సమక్షంలో పెళ్లి చేసుకోవాలని ప్రభుత్వాలు ఆదేశాలు ఇవ్వడంతో... పెళ్లిళ్లకు కెమెరా మరియు పూలు సప్లై చేసే వ్యాపారాలు డల్ అయిపోయాయి. అంతేకాకుండా పెళ్లికి క్యాటరింగ్ చేసేవారికి కూడా పని లేకపోవడంతో కరోనా ఎఫెక్ట్ పెళ్లిళ్ల పై బాగా పడింది. ఆర్కెస్ట్రా కి మరియు పెళ్లికి సంబంధించి పనులు చేసే కొంతమందికి కరోన రాకతో పొట్ట కొట్టినట్లయింది. ప్రస్తుతం జరుగుతున్న పెళ్లి లో ఏ మాత్రం సంతోషం లేని వాతావరణం కనబడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: