ఏపీ రాజకీయాల్లో తొలిసారి అధికారంలోకి వచ్చిన జగన్ ఏది చేసిన సంచలనమే. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పథకం అమలు చేసినా ఏపీ చరిత్రలో సరికొత్త అధ్యాయమే అవుతుంది. అలాగే ఆయన ఒక్కసారిగా మంత్రివర్గం ఏర్పాటు చేసి సంచలనం సృష్టించారు.  మంత్రివర్గం ఒకేసారి ఏర్పాటు చేయడం పెద్ద సంచలనమైతే, ఏవైనా తప్పులు చేస్తే మంత్రి పదవి నుంచి తొలగిస్తానని చెప్పడం కూడా మరో సంచలనం.

 

అయితే ఇప్పుడు పదవులు దక్కనివారికి రెండున్నర ఏళ్లలో మళ్ళీ దక్కే అవకాశముందని, పనితీరు సరిగా లేని మంత్రులని పక్కనబెట్టి కొత్తవారికి అవకాశం కల్పిస్తానని ముందే చెప్పేశారు. ఇక మంత్రివర్గం ఏర్పాటు చేసుకుని జగన్ పాలన మొదలుపెట్టి ఏడాది దాటుతుంది. ఇంకో ఏడాదిన్నరలో కేబినెట్ విస్తరణ జరిగే ఛాన్స్ ఉంది. కానీ మండలి రద్దు నేపథ్యంలో పిల్లి సుబాష్, మోపిదేవి వెంకటరమణలు మంత్రి పదవులు కోల్పోనున్నారు.

 

దీంతో వీరు బెర్త్‌లని భర్తీ చేయాల్సి ఉంది. అలాగే ఇదే సమయంలో పనితీరు మరీ బాగోని వారికి ఉద్వాసన పలికే అవకాశముంది. ఈ క్రమంలోనే నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు మంత్రి పదవి దక్కనుందని ప్రచారం జరుగుతుంది. సొంత పార్టీ పైనే విమర్శలు చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ప్రసాదరాజు కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎంపీ కూడా ప్రసాదరాజుకు కౌంటర్ ఇచ్చారు. ప్రసాదరాజుని ఎవరు మాట్లాడిస్తున్నారో తెలుసని, త్వరలోనే ఆయనకు మంత్రి పదవి రానుందని చెప్పారు.

 

అయితే ఎంపీ రఘు చెప్పడమే కాదు...ప్రసాదరాజుకు మంత్రి పదవి వస్తుందని వెస్ట్ గోదావరి వైసీపీ వర్గాల్లో ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. ఇదే సమయంలో జిల్లాలో ఉన్న మంత్రులు తానేటి వనిత, చెరుకువాడ రంగనాథరాజు పదవులు పోవడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు కాకపోయిన నెక్స్ట్ టర్మ్‌లో ఈ ఇద్దరికీ ఉద్వాసన తప్పదని వెస్ట్ వైసీపీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: