గత కొన్ని రోజుల నుండి తమిళనాడు లో కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా అనూహ్యంగా పెరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో  44 మంది కరోనాతో మరణించారని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈమరణాలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 479కి చేరింది. మరోవైపు ఈ రోజు కూడా భారీగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 1843 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య  46504కు చేరింది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో ఈనెల 19నుండి 31వరకు చెన్నై సహా కరోనా ప్రభావం అధికంగా వున్న మరో మూడు జిలాల్లో పూర్తి లాక్ డౌన్ ను విదిస్తునట్లు తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రకటించారు. 
 
ఇక మరో దక్షిణాది రాష్ట్రం కేరళలో ఈరోజు 82 కరోనా కేసులు నమోదయ్యాయని అలాగే కరోనా తో ఒకరు మృతిచెందినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. రాష్ట్రంలో నిన్న కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గగా ఈరోజు మళ్ళీ భారీగా నమోదయ్యాయి. ఈకొత్త కేసుల తోకలిపి కేరళలో ఇప్పటివరకు మొత్తం 2543కేసులు నమోదుకాగా అందులో1348కేసులు యాక్టీవ్ గా వున్నాయి.కాగా 1174మంది బాధితులు కరోనా నుండి కోలుకోగా 20మంది మరణించారు.
  

మరింత సమాచారం తెలుసుకోండి: