ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన. దాదాపు 15 మంది వరకూ ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన ఇది. ఈ దుర్ఘటన విషయంలో సరిగ్గా డీల్ చేయడంలో విపక్షం తెలుగుదేశం పూర్తిగా ఫెయిలైనట్టు కనిపిస్తోంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధితుల పక్షాన విపక్షాలు పోరాటం చేస్తాయి. అయితే ఈ విషయంలో తెలుగుదేశం జరిపిన పోరాటాలు.. ప్రెస్ పోరాటాలుగానే మిగిలిపోతున్నాయనే చెప్పాలి.

 

 

ఎల్జీ పాలిమర్స్ ఘటన విషయంలో మాజీ సీఎం చంద్రబాబు అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టారు. ప్రభుత్వ తీరును విమర్శించారు. కానీ.. బాధితులను నేరుగా పరామర్శించనే లేదు. ఒకానొక దశలో ఆ ప్రయత్నం చేశారు.. డీజీపీ పర్మిషన్ కూడా తీసుకున్నారు. కానీ.. ఇప్పటి వరకూ ఎల్జీ పాలిమర్స్ బాధితులను చంద్రబాబు గానీ.. లోకేశ్ కానీ పర్యటించలేదు. బాధితులను పరామర్శించలేదు.

 

 

ఇందుకు తెలుగు దేశం చెబుతున్న కారణం లాక్ డౌన్.. ఇది కొంత వరకూ వాస్తవమే కావచ్చు. కానీ లాక్ డౌన్ సడలింపులు బాగా తొలగించిన తర్వాత కూడా చంద్రబాబు విశాఖ వెళ్లి బాధితులను పరామర్శించే ప్రయత్నమే చేయలేదు. హైదరాబాద్ నుంచి విజయవాడ రావడం పని చూసుకుని మళ్లీ హైదరాబాద్ వెళ్లి పోవడం.. ఇలా సాగుతోంది టీడీపీ అగ్రనేతల దిన చర్య.

 

 

ఈ వైఖరిని వైసీపీ నాయకులు తూర్పారపడుతున్నారు. ఎల్‌జీ పాలిమర్స్‌ బాధితులను పరామర్శించడంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. స్థాయికి తగ్గట్టుగా మాట్లాడటం లోకేష్‌ నేర్చుకోవాలని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సూచించారు. జేసీ బ్రదర్స్‌ అక్రమాలు చంద్రబాబు, లోకేష్‌లకు కనిపించడం లేదా అని అంబటి ప్రశ్నించారు. అక్రమ కట్టడంలో నివసిస్తున్న చంద్రబాబు, లోకేష్‌లకు ఇతరులను విమర్శించే హక్కు లేదన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: