భారతదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా మారుతోంది. రోజు రోజుకి కొత్త కేసులు ఊహించని స్థాయిలో బయట పడుతున్న తరుణంలో అటు ప్రభుత్వాల లోనూ ఇటు ప్రజల లోనూ టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా వర్షాకాలం రావటంతో పైగా కేసులు చూస్తే లక్షలు దాటి ఉండటంతో ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. ఇటువంటి టైములో కేంద్ర ఆరోగ్య శాఖ ఊరటనిచ్చే వార్త చెప్పింది. అదేమిటంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ నుంచి కోలుకునే వారి సంఖ్య పెరుగుతోందని, రికవరీ రేటు ఊహించని విధంగా గత కొన్ని రోజుల నుండి పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇప్పటివరకు నమోదైన కేసులు...గడిచిన 24 గంట‌ల్లో  చూస్తే 7419 మంది క‌రోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది.

 

దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 3,32,424 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారని తెలిపింది. అందులో 1,69,797 మంది పూర్తిగా కోలుకున్నార‌ని చెప్పింది. ప్ర‌స్తుతం 1,53,106 మంది వేర్వేరు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని పేర్కొంది. అంతేకాకుండా మన దేశంలో కూడా కరోనా వైరస్ బారిన పడిన వారు సగానికిపైగా చాలా త్వరగా కోలుకున్నారని డిశ్చార్జ్ కూడా అయ్యారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దేశంలో క‌రోనా రిక‌వ‌రీ రేటు 51.08 శాతానికి చేరింద‌ని ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

 

ముఖ్యంగా దేశంలో కరోనా టెస్టులను భారీగా పెంచడంతో రోజుకు లక్షకు పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి అని కేంద్రం తెలిపింది. అంతేకాకుండా టెస్ట్ లు కోసం ప్రభుత్వ ల్యాబ్స్ మరియు ప్రైవేట్ ల్యాబ్స్ కూడా పెంచడం జరిగిందని వివరించింది. మొత్తంమీద చూసుకుంటే టెస్టులు సంఖ్య పెరగటం, కొత్త కేసులు బయటపడటం వలన ప్రమాదం ఏమీ లేదని, రిక‌వ‌రీ రేటు గతంలో కంటే మించి ఉండటం అనేది శుభపరిణామమని వైద్య నిపుణులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: