70 ఏళ్ల వయసులోనూ టీడీపీ అధినేత చంద్రబాబుకు మనశ్శాంతి లేకుండా పోయింది. ప్రశాంతంగా సేద తీరాల్సిన సమయంలో పార్టీ గురించి నిరంతరం ఆలోచిస్తూ తీవ్రంగా టెన్షన్ పడుతున్నారు. ఏపీలో అధికారంలోకి వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి టిడిపి అధినేత చంద్రబాబు ఇదే రకమైన ఒత్తిడికి గురవుతున్నారు. తమ పార్టీని భూస్థాపితం చేయాలని కంకణం కట్టుకుని ముందుకు వెళ్తున్నారు. అధికార పార్టీని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది ఇప్పుడు ఆయనకు తెలియకుండా ఉంది. ప్రస్తుతం చూస్తే ఏపీలో కరోనా విజృంభిస్తోంది. కరోనాను లెక్కచేయకుండా రోడ్లపై ప్రజలతో మమేకమవుతూ తిరిగిన ఎమ్మెల్యేలు కరోనా బారిన పడుతున్నారు. ఇటువంటి సమయంలో వయస్సు రీత్యా చూసుకున్నా, టిడిపి అధినేత చంద్రబాబు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఇది. 

 

IHG


కానీ ఈ సమయంలోనూ ఆయన రాజకీయ ఆందోళనతో హైదరాబాద్ లోని తన నివాసం నుంచి ఏపీకి రావాల్సి వచ్చింది. ఇప్పటి వరకు తనకు చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్న మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవహారం చంద్రబాబుకు మింగుడు పడడం లేదు. అసెంబ్లీలోనూ, బయట వైసీపీ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న అచ్చెన్నాయుడు వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం కవ్వింపు చర్యలకు దిగుతూ, అనూహ్య పరిణామాల మధ్య ఆయనను అరెస్టు చేసింది. అలాగే అనంతపురం జిల్లా నాయకుడు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేసింది. వీరే కాకుండా ఇంకా అనేక మంది నాయకులను టార్గెట్ చేసుకుని ముందుకు వెళుతుంది.


ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని మొదట చంద్రబాబు భావించారు. అయితే ఈ సమయంలో రోడ్డెక్కి ఆందోళనలు చేసిన వారి విషయంలో ప్రభుత్వం ఊరికే వదిలిపెట్టడం లేదు. ప్రస్తుతం విధించిన లాక్ డౌన్ నిబంధన అమలు అవుతుండడంతో అనంతపురం మాజీ ఎంపీ జేసీ ప్రభాకర్ రెడ్డి ,అస్మిత్ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లాలో యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, పిల్లి సత్తిబాబు వంటి వారి పైన కేసులు నమోదు చేయడంతో ఇప్పుడు రోడ్డెక్కి ప్రభుత్వం పై పోరాటాలు చేసేందుకు పార్టీ కేడర్ వెనకడుగు వేస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపే విధంగా అమరావతిలోని కరకట్ట నివాసం నుంచి చంద్రబాబు ఇప్పుడు పార్టీ శ్రేణులు కొంత మందితో కలిసి నిరసన తెలియజేస్తున్నారు. కాగడాలు పట్టుకొని ఆందోళన చేస్తున్నారు. గతంలో ఇంత గడ్డు పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని స్వయంగా చంద్రబాబే పార్టీ నేతల దగ్గర వాపోతున్నారట. 


ఇప్పుడు పెద్ద ఎత్తున టీడీపీ కీలక నాయకులంతా అచ్చెన్న వ్యవహారంతో ఆందోళన చెంది ఇప్పుడు వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిణామాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇవన్నీ ఏడుపదుల వయసులో ఉన్న చంద్రబాబు ను తీవ్రంగా కలవరానికి గురి చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: