తమిళ్ లో విశాల్ హీరోగా నటించిన 'అభిమన్యుడు' సినిమా లో బ్యాంకు లోన్ తీసుకున్న వెంటనే అకౌంట్ నుండి డబ్బులు మాయం అవుతూ ఉండడం మనం చూడవచ్చు. అచ్చం అలాగే ఇప్పుడు ఢిల్లీలోని ఒక వ్యాపారి యొక్క క్రెడిట్ కార్డు నుండి అతనికి తెలియకుండానే ఏకంగా మూడున్నర లక్షల రూపాయల లావాదేవీలు జరిగిపోయింది. ఇక బ్యాంకు వారిని సంప్రదిస్తే మీరు డబ్బులు ఎవరికో పంపించి మమ్మల్ని అడుగుతారు ఏంటి అని ఎదురు ప్రశ్నలు వేశారు.

 

దీంతో అంత డబ్బు ఎలా చెల్లించాలో తేలిక మరియు కుటుంబ భవిష్యత్ గురించి ఆలోచించి అతను ఒక నిర్ణయానికి వచ్చాడు. తాను చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని మరియు తద్వారా కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని భావించాడు. ఆత్మహత్య చేసుకుంటే డబ్బులు రావని.... తనను చంపేందుకు ఒక గ్యాంగ్ తో డీల్ కుదుర్చుకున్నాడు. తన ఫోటో తో పాతు డబ్బులు కూడా పంపి ఫోన్ ద్వారా ఒప్పందం చేసుకున్నాడు. అంతే గ్యాంగ్ వచ్చి తమ పని పూర్తి చేశారు. క్షణాల్లో అతను విగతజీవుడిగా మారాడు.

 

ఢిల్లీలో జరిగిన ఘోరమైన ఘటనలో బాధితురాలి పేరు గౌరవ్ (37) కాగా అతని భార్య షాను బన్సాల్ తన భర్త కనిపించడం లేదంటూ జూన్ 10 పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఉదయం దుకాణానికి వెళ్లిన భర్త ఎంతకూ తిరిగి రాలేదనీ.. ఫోన్ కూడా కలవడం లేదని పోలీసులకు వివరించింది. ఫిబ్రవరిలో తన భర్త బ్యాంకులో ఆరు లక్షల రూపాయల లోన్ తీసుకున్నాడని వెల్లడించింది. అయితే క్రెడిట్ కార్డు మోసం వల్ల తనకు తెలియకుండానే రూ.3.5 లక్షలను పోగొట్టుకున్నాడని వాపోయింది. డబ్బును ఎలా చెల్లించాలో తెలియక.. లాక్ డౌన్ వల్ల బ్యాంకులో లోన్ తీర్చే మార్గం కానరాక కొద్ది రోజులుగా మానసికంగా కుమిలిపోతున్నాడని చెప్పింది.

 

ఇక పోలీసులు విచారణ జరపగా ఢిల్లీ రన్హౌలా ప్రాంతంలో ఒక వ్యక్తిని ఉరి వేసి చంపేశారని మరియు అతని చేతులు కట్టేసి ఉండగా అతను చనిపోయే ముందు చిత్రహింసలు పెట్టి మరీ హత్య చేశారని సమాచారం అందింది. తీరా చూస్తే అది గౌరవే అని ఆమె భార్య గుర్తించింది. ఇక విచారణ వేగవంతం చేయగా గౌరవ కాల్ రికార్డ్స్ బయటికి తీస్తే అసలు గుట్టు బయట పడింది. అతనితో చాలా సార్లు మాట్లాడిన ఒక మైనర్ వ్యక్తిని పట్టుకుని విచారిస్తే అతనిని అతనే చంపుకున్న విధానం రెలసుకొని కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అతనిని అతని చంపమని తన ఫోటో పంపి డబ్బులు ఇస్తేనే తాము దారుణానికి ఒడిగట్టాడని మైనర్ అతను చెప్పగా అతనితో పాటు మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.

 

అయితే మానసిక వైద్యుల దగ్గర గౌరవ్ ట్రీట్ మెంట్ కూడా తీసుకుంటున్నాడని షానూ వివరించడం కొసమెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి: