ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటికీ ఇప్పుడిప్పుడే కోలుకోలేని విధంగా దెబ్బ తీస్తున్న కరోనా వైరస్ మొట్ట మొదట చైనాలో ఉద్భవించిన విషయం మనందరికీ తెలిసిందే. చైనాలోని ప్రముఖమైన వుహాన్ నగరంలో మొట్టమొదటి సారి బయటపడిన వైరస్ ఇప్పటివరకు ఏనాడూ తన ప్రతాపాన్ని తగ్గించింది లేదు. ముఖ్యంగా భారతదేశంలో అయితే గత నెల రోజుల నుండి దీన్ని బెడద రెట్టింపు అయింది అనే చెప్పాలి. అలాగే మిగిలిన దేశాలు కూడా పూర్తిగా దీని ముప్పు నుండి బయటపడలేకపోతున్నాయి.

 

కానీ చైనా దేశం లో మాత్రం మొదట కుప్పలుతెప్పలుగా కేసులు నమోదు అయినా కూడా కేవలం మూడు నెలల్లో వారు వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్నింటిని ఆశ్చర్యపరుస్తోంది. చాలా మంది అయితే వారి దగ్గర ఉందని దీనికి సంబంధించిన మందు ఉందని మరియు అత్యంత క్లిష్ట సమయంలో దానిని బయటకు తీసి ప్రపంచ దేశాలకు తమ డిమాండ్లు వినిపిస్తారని రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాకుండా వైరస్ సహజంగా బయటికి వచ్చినది కాదని కుట్రపూరితంగా వాళ్ళ ల్యాబ్ లో నుండే దీన్ని బయటకు వదలారు అని అంటున్నారు.

 

అయితే ఇప్పుడు చైనా దేశంలో మరలా ఎక్కువ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం మొదలైంది. చైనా లోని పలు ప్రాంతాల్లో కొత్తగా కోవిడ్-19 కేసులు బయటపడడం దేశస్థులను కలవరానికి గురి చేస్తోంది. అయితే ఈసారి మాత్రం చైనా వారు మళ్లీ దాని వ్యాప్తిని లాక్ డౌన్ కూడా లేని సమయంలో కనుక కంట్రోల్ చేస్తే వారు ఖచ్చితంగా ఏదో దాచి పెడుతున్నారని ప్రపంచవ్యాప్తంగా ఉండే వైద్య నిపుణులు మరియు ఆరోగ్య పరిశీలకులు ఒక అంచనాకు వచ్చేస్తారు. ఇక మళ్ళీ మేము సామాజిక దూరం క్రమంగా పాటించాం మరియు ఇంటికి ఒక టెస్టింగ్ కిట్ ఇచ్చాం అని చెప్పుకొస్తే మాత్రం వినే పరిస్థితుల్లో ఎవరూ లేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: