ఈ మద్య తెలంగాణలో కరోనా కేసులు బాగానే పెరిగిపోతున్నాయి. నెల రోజుల క్రితం వరకు మంచి కంట్రోల్ లో ఉన్న కరోనా కేసులు గత పదిహేను రోజుల నుంచి పెరిగిపోతూ వస్తున్నాయి. మొత్తానికి తెలంగాణలో కరోనా కేసుల ఉద్ధృతికి అడ్డుకట్ట పడడం లేదు. నిన్న కూడా 200కుపైగా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య, మంత్రిత్వశాఖ బులెటిన్ విడుదల చేసింది.  రంగారెడ్డి జిల్లాలో 13, మేడ్చల్, సంగారెడ్డిలో చెరో రెండు, వరంగల్ అర్బన్‌లో 4, వరంగల్ రూరల్‌లో 3, మహబూబ్‌నగర్, మెదక్, ఆదిలాబాద్, యాదాద్రి, వనపర్తి, పెద్దపల్లి జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.  అలాగే, ఇప్పటి వరకు 2,766 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, 187 మంది కరోనాతో కన్నుమూశారు.

IHG

రాష్ట్రంలో ఇంకా 2,240 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. గత కొన్నిరోజులుగా  జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. వందకుపైగా కేసులు ఇక్కడి నుంచే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో ఉన్న వారిలో కనీసం 50 వేల మందికి పరీక్షలు చేయడానికి సిద్ధమయ్యారు. దీంట్లో భాగంగా మంగళవారం నుంచి ఆ పరీక్షలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వీటికి కొన్ని ప్రత్యేక ఆస్పత్రులను గుర్తించి అక్కడే టెస్టులు చేయనున్నారు.

IHG

ఈ నేపథ్యంలో  కరోనా పరీక్షల కోసం మూడు ప్రాంతాలను ఎంపిక చేశారు. వనస్థలిపురం, బాలాపూర్‌, కొండాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వీటిని చేయనున్నారు.  వైరస్ లక్షణాలు ఉన్నవారు కూడా వచ్చి టెస్టులు చేయించుకోవచ్చు. దీనికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదు. అయితే ప్రతి రోజు ఒక్కో కేంద్రంలో కేవలం 150 మందికి మాత్రమే చేస్తారు. కాకపోతే ఇది చాలా లిమిట్ గా ఉంటుందని.. త్వరలోనే వీటిని విస్తరించే అంశంపై కూడా అధికారులు సమీక్షలు జరుపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: