రాజకీయంగా టిడిపి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పార్టీ అధిష్టానంపై సొంత పార్టీ నాయకులు కూడా లెక్కచేయకుండా వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ లో హాట్ టాపిక్ గా మారింది.వైసీపీ ప్రభుత్వం వరుసగా టిడిపి కీలక నాయకులు అందర్నీ టార్గెట్ చేసుకుంటూ వెళుతోంది. దానిలో భాగంగానే ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్న నాయుడు, మాజీ ఎమ్మెల్యే అనంతపురం జిల్లా నాయకుడు జేసీ ప్రభాకర్ డ్డిని అరెస్ట్ చేశారు. అయితే వీరిని ఆషామాషీగా అయితే ప్రభుత్వం అరెస్టు చేయలేదు. వీరు పాల్పడిన అవినీతి కుంభకోణాలకు తగిన సాక్ష్యాధారాలు ఉండటంతోనే అరెస్టయ్యారు. అచ్చెన్నయుడు ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టు కాగా, జేసీ ప్రభాకర్ రెడ్డి అక్రమంగా వాహనాలను అమ్మిన కేసులో అరెస్టయ్యారు.
 
IHG
 
ఇదంతా తెలుగుదేశం పార్టీపై దాడిగా చిత్రీకరిస్తూ రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఆ పార్టీ నేతలు స్కెచ్ వేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు టిడిపి జాతీయ కార్యదర్శి లోకేష్ అనంతపురానికి వచ్చారు. లోకేష్ వచ్చినా  పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు ఎవరు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ తదితరులు లోకేష్ పర్యటనకు డుమ్మా కొట్టారు. వీరే కాకుండా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, ఉన్నం హనుమంత్ చౌదరి, జితేంద్ర గౌడ్ కందికుంట ప్రసాద్ వంటి నేతలు ఎవరు లోకేష్ వచ్చిన ఆయన దగ్గరకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
 
 
నకిలీ పత్రాలతో వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అయితే పార్టీ తరుపున మద్దతు ఎందుకివ్వాలి ? ఆయన అవినీతి వ్యవహారాన్ని తాము ఎందుకు భుజాన వేసుకోవాలి అంటూ వారు ఈ పర్యటనకు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. లోకేష్ పర్యటన ఉందని పార్టీ కార్యాలయం నుంచి కీలక నేతలు అందరికి ఫోన్ లు  వెళ్ళిన వారు ఇళ్లకే పరిమితమై పోవడం, కొంతమంది ఫోన్లు స్విచాఫ్ చేసుకోవడం వంటి పరిణామాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ పరిస్థితి ఇప్పుడు అంతంత మాత్రంగా ఉండడం , అధికారపార్టీ తమను కూడా టార్గెట్ చేసుకుంటుంది అనే భయంతో కీలక నాయకులంతా ఇప్పుడు ఎందుకు వచ్చిన తలనొప్పి అంటూ సైలెంట్ గా ఉండు పోయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: