అధికారంలోకి వచ్చాక మరొకసారి వైయస్ జగన్ యూ టర్న్ తీసుకోవటం తప్పేలా లేదు. పూర్తి విషయంలోకి వెళితే డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పెద్దల సభ శాసన మండలిని రద్దు చేయాలని జగన్ ప్రభుత్వం డిసైడ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఆ టైములో అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి దానికి ఆమోదం కూడా తెలిపి పెద్దల సభ రద్దు బిల్ కేంద్రానికి పంపింది జగన్ సర్కార్. కేంద్రం ఆమోదం తెలిపితే వెంటనే శాసన మండలిని రద్దు చేయటం కోసం వైసీపీ వెయిట్ చేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేయటంతో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.

 

దీనికి సంబంధించి 18న నోటిఫికేషన్ విడుదల చేయడానికి రెడీ అయింది. జులై 6వ తారీకున పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇటువంటి విషయంలో ఒకపక్క సభను రద్దు చేయాలని జగన్ సర్కార్ అనుకుంటుంటే ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రభుత్వాన్ని కన్ఫ్యూజన్ లో పడేసింది. ప్రజెంట్ అయితే శాసన మండలి రద్దు అనేది ఇప్పుడప్పుడే తేలే విషయం కాదని ఢిల్లీ వర్గాల నుండి సంకేతాలు అందుతున్నాయి. కేంద్ర పరిధిలో చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి.

 

కాబట్టి పార్లమెంటులో ఏపీ కి సంబంధించి శాసన మండలి రద్దు బిల్లు చర్చకు వచ్చే అవకాశం ఉండకపోవచ్చని...దీంతో ఆ మండలి స్థానాన్ని టీడీపీకి వదిలేయడం కన్నా.. పోటీకి పెట్టి గెలిపించుకోవడం మంచిదన్న భావనలో.. తాజాగా వైసీపీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో శాసన మండలి విషయంలో వైఎస్ జగన్ మరొకసారి యూటర్న్ తీసుకునే అవకాశం ఉన్నట్లు పరిస్థితులు కనబడుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఈ ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: