వైసిపి పార్టీ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ నుండి కోలుకుంటూ సామాన్య జీవితం లోకి పేదవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారులు వచ్చి నిర్భయంగా తమ కార్యకలాపాలు చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కొంతమంది అత్యుత్సాహం కలిగిన ప్రైవేట్ ఆస్పత్రుల బరితెగింపు చేష్టల వల్ల, అదే విధంగా కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల చీరాల నియోజకవర్గంలో వైరస్ వ్యాప్తి చెందుతుందని షాకింగ్ కామెంట్లు చేశారు.   


కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం సామాన్యులు పేదవాళ్లు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవటానికి ముందుకు వస్తుంటే, కొన్ని హాస్పిటల్ నిర్లక్ష్య ధోరణి వల్ల వైరస్ చీరాల నియోజకవర్గంలో భయంకరంగా వ్యాప్తి చెందుతోందని ఆమంచి తెలిపారు. ముఖ్యంగా కామాక్షి హాస్పిటల్ వైద్యులు కరోనా వైరస్ వచ్చిన వారిని ట్రీట్ చేయాల్సిన విధంగా ట్రీట్ చేయకుండా, ఆ హాస్పిటల్ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినా హాస్పిటల్ క్లోజ్ చేయకుండా వ్యవహరించిన ఘటన పై తీవ్రస్థాయిలో సీరియస్ అయ్యారు.

 

దీంతో జిల్లా కరోనా స్పెషల్ ఆఫీసర్ కి ఆమంచి కృష్ణమోహన్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో వెంటనే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి...హ్యూమన్ కాంటాక్ట్ ట్రేస్ అవుట్ చేయాలని సూచించారు. అంతేకాకుండా వారం పది రోజుల క్రింద ఏ విధమైన కేసులు చోటు చేసుకున్నాయో,  ఆ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, కోవిడ్ కంట్రోల్ టీమ్ అధికారులకు ఆమంచి కృష్ణమోహన్ ఫిర్యాదు చేశారు. ప్రజలందరూ భయ పడకూడదని...కొంతమంది నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. కేవలం కొద్ది రోజుల్లోనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఆమంచి కృష్ణమోహన్ ప్రజలకు భరోసా ఇచ్చారు. 


చీరాల మున్సిపల్ ఆఫీసుకి విచ్చేసిన జాయింట్ కలెక్టర్ గారిని , RDO గారిని కలసి చీరాలలో కరోనా వ్యాధి ఏ విధముగా విస్తరించింది , దీనిని ఏ విధముగా నివారించాలి అనే విషయము గురించి అధికారులతో చర్చించి అనంతరము జాన్ పేట సందర్శించి రెడ్ జోన్ ఏరియాలోని కొన్ని కుటుంబాల వారిని కలసి మీకు ఎటువంటి ఇబంది లేకుండా మీకు కావలసిన సౌకర్యాలు కల్పించే విధముగా మేము చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

 

అనంతరం ఆప్రాంతానికి మునిసిపల్ అధికారియైన DE గారిని మరియు అక్కడ పనిచేయుచున్న వాలంటీర్ లను వైద్య సిబ్బంధిని పిలిపించి ఈప్రాంతములో నివసించే ప్రజలకు ఎటువంటి ఇబంది లేకుండా వారికీ సదుపాయాలు కల్పించేందుకు సహాయపడవలసినదిగా కోరారు. ఒక ఆసుపత్రి వలన చీరాల మొత్తం ఇబ్బంది పడడం గురించి జిల్లా మొత్తం డిస్కషన్ లు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: