చంద్రబాబు పార్టీ గురుతు పసుపు. అందుకే పచ్చ పార్టీ అంటారు. నాడు ఎన్టీయార్ ప్రజలు శుభం కోసం పసుపు వాడుతారు అంతా కాబ‌ట్టి తన పార్టీకి ఆ మంచి రంగు ఉండాలని ఎంచి మరీ సెట్ చేసి పెట్టారు. అటువంటి టీడీపీ వ్యవస్థాపకుడు  ఎన్టీయార్ చేత కూడా నల్ల చొక్కా వేయించిన ఘనత చంద్రబాబుదే.

 

చరిత్రలోకి ఒకసారి వెళ్తే 1995 ఆగస్ట్ లో మామ ఎన్టీయార్ నుంచి అధికారం చంద్రబాబు గుంజుకున్నాక పెద్దాయన విలవిలాడిపోయారు. అధికారం కోసం కాదు, అల్లుడు కొట్టిన దెబ్బకు మనసు విరిగి మనిషి కూడా నిలువెల్లా కదిలిపోయారు. ఇక ఈ వెనుపోటు మోసాన్ని చెప్పాలని ఎన్టీయార్ తాను నమ్ముకున్న జనంలోకే వెళ్ళారు. అది కూడా ఉత్తరాంధ్రాలోని శ్రీకాకుళం జిల్లాకు ఆయన వచ్చారు. అపుడు ఎన్టీయార్ తొలిసారిగా తన రాజకీయ జీవితంలో నల్ల చొక్కా తొడిగారు. చంద్రబాబు వెన్నుపోటును నిరసిస్తూ ఆయన ఆ చొక్కా తొడిగారు. అంటే ఆ విధంగా మామకు ఆ చొక్కా తొడిగించింది బాబే.

 

అలా పార్టీ వ్యవస్థాపకుడి నుంచి ఈనాటి తమ్ముళ్ల వరకూ అందరి చేతా నల్ల చొక్కాలు తొడిగిస్తున్న బాబు అది నిరసన అంటున్నారు. కానీ బాబుకు నల్ల చొక్కాలు ఎపుడూ రివర్స్ అవుతున్నాయి. యాంటీ సెంటిమెంట్ గా మారుతున్నాయి. ఆయన బీజేపీ మీద, కేంద్రంలోని మోడీ మీద నిరసన తెలియచేస్తూ నల్ల చొక్కాను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తొడిగారు. ఢిల్లీలో దీక్ష కూడా చేశారు.

 

ధర్మపోరాట దీక్షలు పెట్టారు. ఎన్ని చేసినా నల్ల చొక్కా రాజకీయ  నష్టాన్నే తెచ్చింది కానీ గెలుపును మాత్రం తేలేకపోయింది. అటువంటి నల్ల చొక్కాను బాబు మళ్ళీ నమ్ముకున్నారు. ఇపుడు బాబుది విపక్ష పాత్ర. ఒకే సభలో ముఖ్యమంత్రిగా, విపక్ష నేతగా నల్ల చొక్కాను ధరించిన రికార్డ్ మాత్రం చంద్రబాబుదేనని అంతా అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే నలుపు మీద బాబుకు వలపు ఉందా లేక అదే టీడీపీ పసుపుని మార్చేసిందా అన్నదే పెద్ద డౌట్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: