జగన్ ఏడాది సీఎం. గత ఎన్నికల్లో మంచి మెజారిటీని సాధించారు. ఆయన ఏడాదిగా అనేక పధకాలు అమలు చేస్తూ వస్తున్నారు. జనంలో కూడా పాపులర్ సీఎంగా పేరు తెచ్చుకున్నారు. జాతీయ స్థాయిలో కూడా ఎప్పటికపుడు ఏపీ నానుతోంది. పాలనాపరంగా మంచి నిర్ణయాలు జగన్ తీసుకున్నవి కూడా చర్చకు వస్తున్నాయి.

 

ఇవన్నీ ఇలా ఉంటే ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా జగన్ మోడీతో మంచి సాన్నిహిత్యం కొనసాగించారని అంటారు. ఇక సీఎం అయ్యాక జగన్ మోడీని చాలాసార్లు కలిశారు. అదే విధంగా మోడీ సైతం జగన్ పట్ల సానుకూలంగా ఉంటున్నారని ప్రచారం సాగుతూ వస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే కరోనా మహమ్మారి వేళ  ఇప్పటిదాకా మోడీ ముఖ్యమంత్రులతో జరుపుతున్న వీడియో కాన్ఫరెన్సులలో కనిపించిన జగన్ ఈసారి మాత్రం తాను హాజరుకావడంలేదని ప్రధాని ఆఫీసుకు మేసేజ్ పంపించారు.

 

ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు అదే సమయంలో ఉన్నాయి కాబట్టి. పైగా కేవలం రెండే రోజులు సమావేశాలు జరుగుతున్నాయి. తన హాజరు ఈ కీలకమైన సమయంలో చాలా అవసరం అని జగన్ ప్రధాని కార్యాలయానికి తెలియచేసిన సందేశంలో ఉంది. అయితే అసెంబ్లీ సెషన్ చాలా ఇంపార్టెంట్ అయినా కూడా కరోనా మహమ్మారి దేశంలో వీర విహారం చేస్తున్న వేళ మోడీ మీటింగ్ కూడా చాలా ఇంపార్టంటే.

 

ఇప్పటిదాకా జగన్ తప్పనిసరిగా హాజరవుతూ వస్తున్నారు. కానీ ఈసారి రాలేను అని చెప్పడానికి అసెంబ్లీ కాక వేరే రాజకీయ కారణాలు ఉన్నాయా అన్న డౌట్లు రాజకీయ మేధావులు వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇలా అపాయింట్మెంట్ ఇలా ఇచ్చి అలా రద్దు చేశారు. అంతకు ముందు కూడా  ఢిల్లీలో కూడా రెండు రోజులు వెయిట్ చేస్తే కానీ జగన్ కి షా దర్శనభాగ్యం దక్కలేదు.

 

వీటితో పాటు జగన్ బెయిల్ మీద ఉన్న సీఎం అంటూ బీజేపీ జాతీయ కార్యదర్శి రాం మాధవ్ ఈ మధ్య ఘాటు కామెంట్స్ చేశారు. దాంతో జగన్ కి బీజేపీతో దూరం పెరిగింది అన్న ప్రచారం కూడా మొదలైంది. ఇవన్నీ ఇలా ఉంటే మోడీ మీటింగునకు జగన్ హాజరు కాలేనని చెప్పడానికి స్పష్టమైన కారణాలు ఉన్నప్పటికీ వీటిని కూడా వల్లె వేస్తోంది పొలిటికల్ కారిడార్. సో రానున్న రోజులే ఈ చర్చకు, అనుమానాలకు సమాధానం చెప్పాలేమో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: