దేశంలో కరోనా వచ్చినప్పటి నుంచి లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడూ రద్దీగా ఉండే రవాణా వ్యవస్థ ఒక్కసారే నిశ్శబ్దం కావడంతో రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారాయి. దాంతో అడవుల్లో ఉండే జంతువులు రోడ్లపైకి రావడం మొదలయ్యాయి. అయితే ఈ మద్య వివిధ రాష్ట్రాల్లో గ్రామాల్లో చిరుత, ఎలుగు బంట్లు రావడం చూస్తున్నాం.  ఇక తెలంగాణలో అయితే మరీ దారుణం.. గత నెల రోజుల నుంచి వరుసగా అక్కడక్కడ చిరుతల దర్శనం అవుతూనే ఉన్నాయి. మృగాలు ఆకలి అయినప్పుడు తమ పిల్లలను తామే చంపుకు తింటాయి అంటారు.

 

ఇది అలాంటి ఘటనే. పులి పిల్లలను ఓ మగ పులి అత్యంత క్రూరంగా చంపేసింది కానీ, తినకుండా వదిలేసింది. ఈ దారుణమైన ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని బందావ్‌గర్‌ పులుల రిజర్వ్‌లో మంగళవారం చోటు చేసుకుంది.  ఇక్కడ రెండు పులి పిల్లలు చనిపోయి ఉండడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. అయితే ఆ పులి పిల్లలను ఏ పిల్లిజాతి చంపి ఉంటుందని భావించారు.. ఆ తర్వతా అవి చనిపోయిన తీరును చూసి అధికారులు తొలుత  పిల్లి జాతికి చెందిన ఓ మగ జంతువు చంపి ఉంటుందని భావించారు.

 

విచారణ చేపట్టి అసలు నిజాన్ని పసిగట్టారు. శవపరీక్ష నివేదికలో ఆ పులి పిల్లలను మగపులి దాడి చేసి చంపిందని నిర్ధారణ అయింది. ఈ మేరకు బందావ్‌గర్‌ పులల రిజర్వ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అనిల్‌శుక్లా వెల్లడించారు.  ఈ విషయాన్ని ఆయన  జాతీయ పులుల సంరక్షణ సంస్థకు నివేదించినట్లు ఆయన తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: