గత నెల విశాఖ పరిసర ప్రాంతంలో జరిగిన ఎల్జీ పాలీమర్స్ గ్యాస్ లీకేజి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దురదృష్టకర ఘటనలో సదరు పాలిమర్స్ కంపెనీ నిర్లక్ష్యం వల్ల 12 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా.... ఎంతోమంది ఇప్పటికీ అనారోగ్యంతో బాధ పడుతూ ఉండటం గమనార్హం. ఏపీ ప్రభుత్వం చనిపోయినవారి ఒక్కో కుటుంబానికికోటి రూపాయల నష్టపరిహారం తోపాటు దానివల్ల ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్కరికి నగదు రూపంలో పరిహారం చెల్లించారు. కానీ విషయాన్ని అయితే ఎవరూ అంత అంత తేలికగా వదిలేలా కనిపించడం లేదు.

 

ఇప్పటికే విష వాయువు లీకేజీ దుర్ఘటనపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఎల్జీ పాలీమర్స్ కు భారీగా నష్టం వాటిల్లుతుందని మనకి బోధపడగా.... దుర్ఘటనను సుమోటోగా తీసుకోవడాన్ని మరియు హైకోర్టు ప్లాంట్ ను సీల్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించగా సుప్రీం కోర్టు.... హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన విషయం కూడా తెలిసిందే.

 

అయితే ఇప్పుడు తాజాగా ఎల్జి పాలన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ.... కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు మరియు ఇతర సభ్యుల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా తన తుది నివేదికను త్వరలోనే సిద్ధం చేయనున్నామని హైపవర్ కమిటీ చైర్మన్ నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం తెలిపారు. హైపవర్ కమిటీ ని గ్యాస్ స్టోరేజ్ ట్యాంక్ నుండి గ్యాస్ లీక్ కావడానికి కారణమైన అంశాలను మరియు అందులో సిబ్బంది, యాజమాన్యం మరియు రాష్ట్రంలో సంబంధిత అధికారుల నిర్లక్ష్యాన్ని తెలియపరచడానికి సేకరించడానికి మరియు తదనంతర నివారణ చర్యల గురించి అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.

 

ఇందులో భాగంగా 243 రిప్రజెంటేషన్స్, 115 టెలిఫోన్ పబ్లిక్ కాల్స్, వందలాది వాట్సాప్ మెసేజెస్ ను రిసీవ్ చేసుకుంటున్నామని చెప్పిన శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్.... ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల తో సహా నివేదికలో పొందుపరచిన ప్రతి అంశానికి ఎల్జీ పాలిమర్స్ జవాబు చెప్పవలసి ఉంటుందని తేల్చి చెప్పారు. ఇప్పటికే కొంతమంది రెగ్యులేటర్లు సమాధానాలు ఇవ్వగా ఇంకా చాలామంది నోరుమెదపవలసి ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది. జూన్ 15 హైదరాబాద్ లోని డాక్టర్ సాగర్ ధార ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ అండ్ ఎన్విరాన్మెంట్ లిస్ట్ మరియు హైదరాబాద్ కే చెందిన సైంటిస్ట్.... డాక్టర్ బాబురావు లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన హై పవర్ కమిటీ యాక్సిడెంట్ కి సంబంధించిన కారణాలను.. తదనంతర ఘటనపై విస్తృతంగా చర్చించడం జరిగింది.

 

ఇక హైపవర్ కమిటీ చెబుతున్న విషయాలు అన్నింటినీ చూస్తుంటే ఎల్జి పాలిమర్స్ ఘటన నుండి అంత సులభంగా బయటపడేలా కనిపించడం లేదు. అసలు వారికి తర్వాత తమ కార్యకలాపాలను చేసుకునేందుకు అనుమతి లభిస్తుందా అన్న విషయం కూడా సందేహమే. ఇకపోతే వారిపై పడబోయే జరిమానా మరియు యాజమాన్యం మరియు కీలక సిబ్బందిపై తీసుకోబోయే చర్యలు గురించి ఎల్జీ సంస్థతోపాటు, బాధిత కుటుంబాలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి హైపవర్ కమిటీ తన పవర్ ను ఎంత సమర్థవంతంగా ఉపయోగిస్తుందో వేచిచూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: