గత కొంత కాలంగా తెలంగాణలో ప్రజాస్వామ్యం నశించి పోతుందని.. ప్రజల కష్టాలకు అండగా నిలబడి ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అంటూ.. అధికార పార్టీకి ఒక నీతి ప్రతి పక్ష నాయకులకు ఒక నీతా? అంటూ పోలీసులపై మండిపడ్డారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.  అధికారాన్ని అడ్డు పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ వేల మందితో యాగాలు చేస్తే ఆయనకు పోలీసులు కాపలా ఉంటూ కార్యక్రమం నిర్వహించారని.. తాము సామ‌ర‌స్యంగా పోరాటం చేస్తే రోడ్డు మీద‌కు ఈడుస్తున్నార‌ని అన్నారు. విద్యుత్ బిల్లుల సమస్య పై మంగళవారం విద్యుత్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చేందుకు కాంగ్రెస్ నాయకులతో వెళుతున్న‌ జీవన్ రెడ్డిని జగిత్యాల టౌన్ పోలీసులు మార్గ‌మ‌ధ్యంలోనే అడ్డున్నారు. 

IHG

అక్క‌డ కొద్దిసేపు ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెలకొంది. ఈ క్ర‌మంలో పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు మ‌ధ్య తోపులాట జ‌రగడంతో కాంగ్రెస్ నాయ‌కులు స్థానిక మెయిన్ రోడ్డు పై ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ jeevan REDDY' target='_blank' title='జీవన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>జీవన్ రెడ్డి మాట్లాడుతూ… కరోన వైరస్, లాక్ డౌన్ కార‌ణంగా నిరుపేద వర్గాలు, కులవృత్తులు వలస కార్మికులు, రవాణా రంగంపై ఆధారపడిన కార్మికులు, వ్యాపారస్తులు.. ఇలా ఎంతో మంది ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నార‌ని అన్నారు. 

 

ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేయబడిన టెలిస్కోపిక్ విద్యుత్ బిల్లుల చెల్లింపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి నాన్ టెలిస్కోపిక్ విధానం గా మార్చడంతో గత నాలుగు సంవత్సరాల నుండి గృహ వినియోగదారులపై విద్యుత్ భారం అధికంగా పడుతుందని తెలియజేశారు.  ప్రజలకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: