నాయకులని వాడుకోవడంలో టీడీపీ అధినేత చంద్రబాబుని మించిన వారు ఎవరు లేరనే విషయం రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు బాగా తెలుసు. అవసరాన్ని బట్టి బాబు..నేతలనీ ఉపయోగించుకుంటారు. ఇక అవసరం తీరిపోయాక, నాయకుల్లో సత్తా తగ్గిపోయాక బాబు ఎలా వదిలేస్తారో అనేదానికి కూడా చాలానే ఉదాహరణలు ఉన్నాయి. ఆ ఉదాహరణలు జోలికి పోతే చాలా కథలు చెప్పాలి. కాబట్టి ఆ విషయం పక్కనబెడితే...బాబు మరో నేతకు చెక్ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

 

టీడీపీ సీనియర్ నేత మాగంటి వెంకటేశ్వరరావు(బాబు)ని చంద్రబాబు పక్కన పెట్టేస్తారని తెలుస్తోంది. కమ్మ సామాజికవర్గానికి చెందిన మాగంటి బాబు కాంగ్రెస్ తరుపున 1998 ఎన్నికల్లో ఏలూరు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయి, మళ్ళీ 2014 ఎన్నికల్లో టీడీపీలో గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

 

ఓడిపోయినా దగ్గర నుంచి మాగంటి పెద్ద యాక్టివ్ గా ఉన్నట్లు కనిపించడం లేదు. ఆయన ఆరోగ్యం అంతగా సహకరించకపోవడంతో, తనయుడు మాగంటి రామ చంద్రన్ పార్టీ బలోపేతం చేసుకుంటూ ముందుకెళుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. వైసీపీ ప్రభుత్వంపై పోరాటాలు చేసే విషయంలో కూడా రామచంద్రన్ ముందు ఉంటున్నారు. అయితే రామచంద్రన్ పనితీరు చాలావరకు బాగానే ఉండటంతో, వచ్చే ఎన్నికల్లో ఆయనకే ఏలూరు ఎంపీ టిక్కెట్ దక్కొచ్చని టీడీపీ కార్యకర్తలు భావిస్తున్నారు.

 

ఆరోగ్యం బాగుంటే  మాగంటి బాబుకే టిక్కెట్ వస్తుందని, లేదంటే ఆయన తనయుడుకు వస్తుందని అనుకుంటున్నారు. కానీ ఈ విషయంలో చంద్రబాబు ఆలోచన వేరుగా ఉందని తెలుస్తోంది. ఎందుకంటే రాజకీయ పరంగా, ఆర్ధిక పరంగా మాగంటి ఫ్యామిలీ వీక్ అయిపోయింది. దీంతో బాబు...మాగంటి ఫ్యామిలీని పక్కనబెట్టేసి ఆర్ధికంగా బలంగా ఉండే మరో కమ్మ నేతకు టిక్కెట్ ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదని వెస్ట్ గోదావరి జిల్లా టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: