ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారానికి దూరమై ఏడాది పూర్తైంది. ఈ ఏడాది కాలంలో బీజేపీ - జనసేన కూటమి అంతోఇంతో బలపడితే టీడీపీ మాత్రం రోజురోజుకు బలహీనపడుతోంది. రాష్ట్రంలో ఆ పార్టీని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. చంద్రబాబుకు వయస్సు మీద పడుతుండటంతో ఆ పార్టీకి భవిష్యత్తు నాయకుడు ఎవరు...? అనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్మికులపై ఘాఠు ప్రేమ కురిపిస్తోంది. 
 
రాష్ట్రంలో 2014 - 2019 సమయంలో భవన నిర్మాణ కార్మికులకు ఎంతో లబ్ధి చేకూరుతోందని... ప్రస్తుతం వైసీపీ హయాంలో వారికి తీవ్ర నష్టం జరుగుతోందని భవన నిర్మాణ కార్మికుల అంతరంగం పేరుతో టీడీపీ తన సొంత భావాలను సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తోంది.

 

టీడీపీ సోషల్ మీడియా పోస్ట్ లో "2014 నుండి 2019 ఎలక్షన్ నోటిఫికేషన్ వరకు భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి బోర్డు నుండి భవన నిర్మాణ కార్మికులకు అందిస్తున్న సంక్షేమ పథకాలు

1) వివాహకానుక 20,000 రూపాయలు...  ప్రసూతి కానుక 20,000 రూపాయలు... ఏదైనా ప్రమాదం జరిగిన తరువాత హాస్పిటల్స్ ఖర్చులు మరియు జీవనోపాధి భత్యం నిమిత్తం 9,000 రూపాయలు... ప్రమాదవశాత్తు చనిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ నుండి వచ్చే 5,00000 లక్షల రూపాయలు 6 నెలల కాలంలోగా కార్మికులుకు అందివ్వాలి.  గతంలో 3 నెలలలోనే  వచ్చేవి... కానీ 2019 ఎలక్షన్ తరువాత ఈ రోజు వరకు కార్మికులకు క్లైముల తాలూకు రావలసిన డబ్బులు ఈ రోజు వరకూ రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత వివాహ కానుక లక్ష రూపాయలకు పెంచారు. ఎవరికి ఇచ్చిన దాఖలాలు లేవు.  జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ వారిని అడిగితే మీకు వివరాలు వస్తాయి.

 

2) ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇసుక నూతన పాలసీ అని చెప్పి 4 నెలలు తాత్సారం చేసి సుమారు 60 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న తరువాత ఇసుక పాలసీని తీసుకొచ్చారు. ఇసుక దరను అమాంతం పెంచేసారు.సిమెంట్, ఐరన్,శానిటరీ,ఎలక్ట్రికల్,ఇటుకబట్టీ,కంకర క్వారీలు తదితర వాటిపై ఆధారపడి ఉన్న వారిని నిస్తేజపరిచారు. భవన నిర్మాణ రంగం కుదేలయింది.చంద్రబాబు నాయుడు గారు కూడా ఇసుకను నూతన పాలసీ ద్వారా నిర్వహించారు. ఎక్కడా కార్మికులు గాని,భవన నిర్మాణ రంగంలో ఆధారపడిన వారికి గాని ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. సామాన్యులు సైతం సులభంగా గృహ నిర్మాణం చేపట్టారు.ఆన్లైన్ ద్వారా బుకింగ్ అంటారు 12 గంటల కు పోర్టల్ ఓపెనవుతుంది. 12.05 క్లోజ్ అవుతుంది. బయట బ్లాక్ లో ఎక్కువ రేటుకు ఇసుక దోరుకుతుంది. స్టాక్ యార్డు ముసుగులో దోపిడీకి ఆస్కారం కల్పించారు.ఇదంతా ప్రభుత్వ అధికారుల సమక్షంలో జరుగుతుండటం విశేషం.

 

3)కరోనా వైరస్ లాక్ డౌన్ లో అన్ని రాష్ట్రాలు భవన నిర్మాణ కార్మికులను ఆదుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కార్మికులకు ఎలాంటి సహాయం అందలేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను ఆదుకోలేదు.

 

4) నూతనంగా కార్మికులు నమోదు చేసుకుంటే గుర్తింపు కార్డులు గతంలో 10 రోజుల్లో కార్డులు వచ్చేవి ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత నమోదు చేసుకున్న  వారికి ఇప్పటివరకు సంవత్సరం కాలంగా కార్డులు రాలేదు.

 

5) సంక్షేమ మండలి భోర్డు ను భర్తీ చేయలేదు. పాలకమండలి లేకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సంక్షేమ మండలి బోర్దును కార్మిక సంఘాలు నాయకులతో ఏర్పాటు చేయాలి.

 

6) వసూలు చేసిన సెస్ వివరాలు తెలపాలి. శ్వేతపత్రం విడుదల చేయాలి.

 

7) కార్మికులకు కల్పించిన సంక్షేమ పథకాలు కోతలు లేకుండా అమలు చేయాలి.

 

8) భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి బోర్డు నిర్వహణలో భవన నిర్మాణ కార్మికులను బాగస్వాములను చేయాలి. గతంలో చంద్రబాబునాయుడు గారు ఆ విధంగా  నిర్వహించారు.కార్మిక నాయకులు గల్లా రాము తదితరులను బోర్డులో సభ్యులుగా నియమించారు.

 

9) రాజధాని అమరావతిలో లక్షలాది కార్మికులకు పని దొరికేది. పనులు నిలిపివేయడంతో దిక్కుతోచని పరిస్థితి కార్మికులకు ఏర్పడింది. రాజధాని పై స్పష్టత లేకపోవడంతో నిర్మాణరంగం కుదేలయింది.  రెక్కాడితేనే గాని డొక్కాడని కార్మికులు వలసలు పోవలసి వస్తుంది.

 

10) ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత సంవత్సర కాలంలో 3 నెలలు పని దొరికితే వట్టు. " అని పేర్కొంది. 

టీడీపీ గత ఐదేళ్లలో మాటల్లో మాత్రమే కనిపించిన అభివృద్ధి గురించి ఇప్పటికీ ఆ పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేసుకుంటూ ఉండటం గమనార్హం. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: