తెలుగుదేశం పార్టీ నేతలను వైసీపీ పార్టీలో చేర్చుకోవడానికి అధికార పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు పై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. అత్యధికమైన మెజార్టీ కలిగి ఉన్న ఇలాంటి సమయంలో వైసీపీ ఈ విధంగా వ్యవహరించడాన్ని తప్పు పడుతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇలానే వ్యవహరించింది...ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా ఈ విధంగానే వ్యవహరించటం ఏమాత్రం సమంజసం కాదని చాలామంది అంటున్నారు.

 

మరోపక్క ఎలాగైనా 2019 ఎన్నికల దెబ్బకి ఏర్పడిన డ్యామేజ్ మీద...మరో దెబ్బ కొట్టాలి...ఇంకా పూర్తిగా తన ప్రత్యర్థి పార్టీగా లేకుండా...ఎదురులేని పార్టీగా ఆంధ్ర రాజకీయాల్లో రాణించాలని వైసీపీ భావిస్తున్నట్లు పరిశీలకుల మాట. ఇలాంటి రాజకీయాలపై విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. మొదటిలో అసెంబ్లీలో జగన్ తొలి ప్రసంగం లో కచ్చితంగా ఇతర పార్టీలకు చెందిన నాయకులను తమ పార్టీలోకి చేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తే కచ్చితంగా రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకుంటామని జగన్ చెప్పడం జరిగింది. ఒకవేళ పార్టీలో వచ్చిన అంతకుముందు ఆ నియోజకవర్గంలో చెందిన వైసీపీ పార్టీ నాయకులకు మరియు కొత్తగా వచ్చిన వారికి మధ్య ఖచ్చితంగా వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

 

ఇటువంటి తరుణంలో పార్టీలోకి ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవడం పట్ల జగన్ కి లాభం ఏమీ ఉండదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటువంటి రాజకీయం చేయడం వల్ల పార్టీలో అసంతృప్తి పెరగటమే కాదు గ్రూపులు తయారవుతాయని, ఇతర పార్టీల నుంచి చేర్చుకొని ఇంత మంచి చేసిన జగన్ కి అది పార్టీ కి లాభం ఏమీ ఉండదని పేర్కొంటున్నారు. మొత్తం మీద వైసీపీ పార్టీ ఇతర పార్టీ నేతలను చేర్చుకోవడం పట్ల సామాన్యులలో మరియు రాజకీయాల్లో కూడా విమర్శలు గట్టిగానే వస్తున్నాయి. ఏదిఏమైనా తెలుగుదేశం పార్టీ నేతలు ప్రస్తుతం వైసీపీ పార్టీలో చేరిన రాజకీయ పరిణామాలు చూసి వైసీపీ, టీడీపీ పార్టీలో రెండు దొందూదొందే చాలా మంది భావిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: