కరోనా వైరస్ ఇండియాలో కోరలు చాస్తోంది. వైరస్ ప్రభావం రోజురోజుకీ పెరుగుతున్న తరుణంలో ఊహించని విధంగా కొత్త కేసులు రోజుకి రికార్డు స్థాయిలో నమోదవుతున్న తరుణంలో ప్రభుత్వాలలో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే రోజు బయటపడుతున్న కొత్త కేసుల విషయంలో సంఖ్యా పరంగా భారత్ ప్రపంచ వ్యాప్తంగా నాలుగో స్థానంలో చేరింది. ఇది ఆందోళన కలిగించే విషయం కాబట్టి జూలై చివరి నాటికి కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని దాదాపు 15 లక్షలు కొత్త కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజెంట్ ఇండియాలో 5 లాక్ డౌన్ కొనసాగుతోంది. మూడో దశ లాక్ డౌన్ టైం నుండి చాలావరకు మినహాయింపులు మరియు ఆంక్షలు ఎత్తివేయడం జరిగింది.

 

ప్రస్తుతం ఐదో దశ లాక్ డౌన్ అమలులో ఉన్నా గాని లేనట్లుగానే పరిస్థితి ఉండటం అనేది వాస్తవం. దాదాపు జనాలు ఎక్కువగా గుమ్మ గూడిన ప్రాంతాలు స్థలాలు అయినా...ప్రార్థన మందిరాలు, హోటళ్ళు మరియు రెస్టారెంట్లు ప్రారంభం కావడం జరిగింది. దీంతో ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా పెరిగింది అని చాలా మంది భావిస్తున్నారు. చాలా రాష్ట్రాలలో మహారాష్ట్ర, ఢిల్లీ మరియు తమిళనాడు వంటి చోట్ల భయంకరంగా వైరస్ ప్రభావం ఉంది. మళ్లీ మరోసారి ఈ రాష్ట్రాలలో లాక్ డౌన్ విధిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు. గత కొన్ని రోజుల నుండి భారత్ లో పూర్తి స్థాయి కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడిప్పుడే రాష్ట్రాలు ఆర్థికంగా కోలుకునే పరిస్థితి ఏర్పడింది. మరో పక్క ఉపాధి లేక నష్టపోయిన చాలామంది ఇప్పుడిప్పుడే పనులు వెళ్లే పరిస్థితి ఏర్పడింది.

 

ఇటువంటి సమయంలో వచ్చే జూలై మాసం లో కరోనా వైరస్ ప్రభావం ఇండియాలో ఎక్కువగా ఉంటుందని, రికార్డు స్థాయిలో కరోనా కేసులు ఇండియాలో నమోదవుతాయి అని వైద్య నిపుణులు అంటున్నారు. దీంతో కేంద్రంలో పెద్దలు మరియు మోడీ కూడా వచ్చే జులై మాసం కి దేశంలో ఎటువంటి విపత్కర పరిస్థితులు చోటు చేసుకుంటాయో అనే టెన్షన్ లో పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలకు వైద్య సదుపాయం ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే విధంగా రెడీ చేసుకోవాలి అని కేంద్రం నుండి హెచ్చరికలు రాష్ట్ర ప్రభుత్వాలకి వెళ్లినట్లు టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: