ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం ఇండియాలో భయంకరంగా వ్యాప్తి చెంది ఉంది. ప్రజెంట్ ఉన్న పరిస్థితి ఇంకా రెండు నెలలు కొనసాగితే ఇండియాలో రోడ్డుమీద ఎక్కడికక్కడ శవాలు
కుప్పలుతెప్పలుగా పడిపోయే పరిస్థితి ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా భారతీయులు కరోనా వైరస్ ని పెద్దగా డేంజరస్ విషయంగా తీసుకోలేదని ఇందువల్లే ప్రజెంట్ రోజుకి పది వేల కంటే కొత్త కేసులు నమోదవుతున్నాయి చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ మందు యూకే నుండి దిగుమతి అవుతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఈ వైరస్ పై జరుగుతున్న పోరాటంలో నూతన అధ్యాయం స్టార్ట్ అయ్యింది.

 

కోవిడ్ 19 కి వ్యతిరేకంగా పనిచేసే మందుల లో ప్రాణాపాయం నుండి తగ్గించగలిగే మెడిసిన్ మొదటిసారిగా యూకే వైద్యులు కనుగొన్నారు. ఇది యూకే నుండి ఇండియాకి దిగుమతి అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. నేషనల్ హెల్త్ సర్వీస్ నుండి మార్టిన్ ల్యాండ్ రే మరియు కొంతమంది బృందం కలిసి చేసిన మెడిసిన్. ఇది స్టెరాయిడ్ రూపంలో ఉంటుందట. Dexamethasone అనే మిశ్రమం ఉంటుంది. ఇది 6 మిల్లీ గ్రాములు పది రోజులు ఇస్తే డెత్ రేటు తగ్గే అవకాశం ఉందని పరిశోధనలో తేలింది.

 

ముఖ్యంగా కరోనా వైరస్ తో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులు అయినా ఆక్సిజన్ కావలసినవారు, వెంటిలేటర్ పై చావు తో పోరాడుతున్న వారికి ఈ Dexamethasone అనే మెడిసిన్ చాలా అద్భుత రీతిలో పనిచేస్తుందని తేలింది. త్వరలోనే వ్యాక్సిన్ కూడా వచ్చే అవకాశం ఉంది అని ప్రపంచ స్థాయిలో వార్తలు వినబడుతున్నాయి.  ఈ ఏడాది ప్రారంభం నుండి వరుసగా భయంకరమైన వార్తలు వినబడుతున్న టైంలో మొట్టమొదటిసారిగా ఈ వార్త యూకేలో మీడియా వర్గాలు ప్రకటించడం జరిగింది. దీంతో అంతర్జాతీయ మీడియా ఎక్కువగా ఈ ఏడాది మోస్ట్ ఆఫ్ ద హ్యాపీ యాస్ట్ న్యూస్ ఇదే అని ఈ న్యూస్ ని వైరల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా రావడంతో చాలా మంది నెటిజన్లు యూకే వైద్యులపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: