కరీంనగర్ జిల్లాలో కరోనా మళ్ళీ పంజా విసురుతుంది. రాష్ట్రంలో మొదటి కేసు ఈ జిల్లాలోనే నమోదు కాగా ఆతరువాత క్రమంగా కేసుల సంఖ్య పెరుగుకుంటూ పోయింది అయితే కట్టుదిట్టమైన లాక్ డౌన్ కు తోడు ప్రభుత్వానికి ప్రజలు కూడా సహకరించడంతో ఇటీవల ఒక్క కేసు కూడా నమోదుకాలేదు కానీ ఇప్పుడు కథ మళ్ళీ మొదటికొచ్చింది. నిన్న ఒక్క రోజే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 6పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదలచేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. దాంతో జిల్లా వాసుల్లో మళ్ళీ టెంక్షన్ స్టార్ట్ అయ్యింది. 
ఇక నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 213కేసులు నమోదు కాగా అత్యధికంగా జిహెచ్ఎంసి లో 165, రంగారెడ్డి లో 16 , మెదక్ లో 13కేసులు నమోదయ్యాయి. అలాగే నిన్న కరోనా తో 4గురు మరణించారు. ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 5406 కరోనా కేసులు నమోదవ్వగా అందులో 3027మంది బాధితులు కోలుకోగా ప్రస్తుతం 2188కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఇప్పటివరకు కరోనా తో మరణించిన వారి సంఖ్య 191కు చేరింది. నిన్న మొత్తం 1251 శాంపిల్ టెస్టులు చేశారు.
 
ఇదిలావుంటే దేశ వ్యాప్తంగా నిన్న11000కు పైగా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 354000కు చేరింది. కాగా ఇప్పటివరకు దేశంలో 11000 కరోనా మరణాలు సంభవించాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో గత కొద్దీ రోజుల నుండి భారీగా కేసులు నమోదవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: