తూర్పు లడఖ్ లోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల్లో 20 మంది భారతీయ సైనికులు చనిపోయారని ప్రభుత్వ వర్గాలు అధికారికంగా తెలిపారు. సంఘటనా స్థలం వద్ద తెలంగాణ, సూర్యపేటకు చెందిన వీర జవాన్ సంతోష్ తో సహా మరో ఇద్దరు చనిపోయారని మరియు 17 మంది సైనికులు పోరాటంలో తీవ్రంగా గాయపడగా వారు కూడా చికిత్స పొందుతూ మరణించారు అని చెప్పారు.

 

ఐతే సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న మంచుకొండల్లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద ఉండడంతో పరిస్థితి విషమించి గాయపడిన వారి ప్రాణాలు దక్కలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లు ప్రముఖ వార్తా సంస్థ ఒకటి పేర్కొంది. అయితే భారత దేశ సైనికులు 20 మంది చనిపోగా చైనా ప్రభుత్వం తమకు కూడా భారీగానే ప్రాణ నష్టం జరిగిందని వెల్లడించడం గమనార్హం.

 

ఇక తీవ్రంగా గాయపడిన చైనీస్ సైనికుల సంఖ్య ఎక్కువగానే ఉండగా ఇప్పటి వరకు కనీసం 43 చైనీయులు చనిపోయి ఉంటారని వార్తలు వస్తున్నాయి. చైనా వైపున చనిపోయిన వారి సంఖ్య కచ్చితంగా చెప్పలేము అని తెలిపిన వారు ఖచ్చితంగా భారత ఆర్మీ లో జరిగిన ప్రాణ నష్టానికి రెట్టింపు ప్రాణ నష్టం జరిగి ఉంటుందని మాత్రం చెబుతున్నారు. అయితే మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం.

 

LAC వెండి చైనీస్ చాపర్లు చక్కర్లు కొట్టాయని.. మృతి చెందిన, గాయపడ్డ వారిని అక్కడి నుంచి ఎయిర్ లిఫ్ట్ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు చైనా సైనికులు వారు ఇంకా భారీ సంఖ్యలో చనిపోయినట్లు నిర్థారించుకున్నామని తెలిపారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: