లడఖ్ లోని గల్వాన్ లోయలో చైనా సైనికులు భారత భద్రతా దళాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఇందులో 20 మంది భారత జవాన్లు మృతి చెందగా చైనా వారు కూడా దాదాపు 43 మంది చనిపోయారని వార్తలు బయటకు వచ్చాయి. గత వారం రోజులుగా భారత్-చైనా సరిహద్దు ప్రాంతం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు దాడి జరిగిన తర్వాత దీని వెనక ఉన్న ఒక కొత్త కోణం ఆవిష్కృతమైంది.

 

వివరాల్లోకి వెళితే ఇప్పుడు ప్రపంచం రూపురేఖలనే మార్చేసిన కరోనా వైరస్ చైనా దేశంలో మొట్టమొదటిసారి బయటపడ్డ విషయం తెలిసిందే. అక్కడినుండే మిగతా దేశాలన్నింటికీ వైరస్ సోకింది. అయితే భారతదేశంలో కూడా దీని ప్రభావం మొదలవగా కేంద్ర ప్రభుత్వం వెంటనే లాక్ డౌన్ విధించింది. ఇక పోతే తాజాగా మోదీ మాట్లాడుతూ దేశంలోని ప్రజలందరూ స్థానికంగా చేయబడ్డ వస్తువులను కొనేందుకే మొగ్గు చూపాలి అని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆత్మ నిర్భర్ భారత్ కింద ప్రజలు ఒకరికొకరు చేయూతని ఇచ్చుకోవాలి అని ఆయన అన్నారు.

 

భారతదేశంలో ప్రజలందరూ వాడే చాలా వస్తువుల్లో ఎక్కువగా చైనా నుండి దిగుమతి చేసుకోబడినవే. మొదట్లో మోడీ అన్న మాటలను అందరూ చాలా తేలికగా తీసుకునా.... సదరు వ్యాపార కంపెనీలు మరియు అనేక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లు పూర్తిగా చైనా వస్తువులను బహిష్కరించడం మొదలుపెట్టాయి. దేశీయ మార్కెట్ కు బయట ఉన్న డిమాండ్ గురించి మరియు ఆవశ్యకతను కరోనా సంక్షోభం వారికి బాగానే బోధించింది.

 

దీంతో భారతదేశంలో చైనా వారి మార్కెట్ ఘోరంగా పడిపోయింది. గత రెండు రోజులు స్టాక్ మార్కెట్ చూస్తే వచ్చిన భారీ మార్పును మనం గమనించవచ్చు. ఇదంతా చైనా వస్తువుల దిగుమతి మరియు వాడకం తగ్గడం వల్లనే అని ఆర్థిక నిపుణులు కూడా నిన్ననే తెగేసి చెప్పారు.

 

భారత్ లాంటి అన్ని మౌళిక సదుపాయాలు మరియు వనరులు దేశం కరోనా సంక్షోభం నుండి బయట పడగానే ఆర్థికంగా అధికంగా కోలుకునేందుకు ఎక్కువ సమయం పట్టదు. కాబట్టి చైనా భారత దేశాన్ని దెబ్బతీసేందుకు ఉన్న ఏకైక అవకాశం సరిహద్దు గొడవ. కావున దొడ్డి దారిలో నుంచైనా భారత్ ను దొంగదెబ్బ తీసేందుకు చైనా వారు దాడికి పూనుకున్నారు అని విశ్లేషకుల అభిప్రాయం మరియు ఆర్థిక నిపుణుల గట్టి నమ్మకం.

మరింత సమాచారం తెలుసుకోండి: