ఎక్కడా ఎదురే లేకుండా ముందుకు వెళుతున్నాను అని భావిస్తున్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ కు ఇప్పుడు సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఆయన అసలు ఎందుకు సొంత పార్టీపై విమర్శలు చేస్తున్నారో, ఏమి ఆశిస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. జగన్ ను తిడుతూనే ఆ తర్వాత పొగుడుతూ, రకరకాలుగా ఆయన వ్యవహరిస్తున్నారు. దేశమంతా జగన్ వైపు చూస్తుంటే, తాను ఎందుకు ఇతర పార్టీలో చేరతానని చెబుతూనే జగన్ తీరును ఆయన తప్పు పట్టడమే కాకుండా, నా కాళ్ళ వేళ్ళ పడి వైసీపీలోకి రమ్మని బతిమిలాడితే వచ్చాను అంటూ ఆయన చెప్పడం,  నరసాపురంలో పార్లమెంట్ నియోజకవర్గంలో జగన్ ఇమేజ్ తో కాకుండా, తన సొంత ఇమేజ్ తో  గెలిచానని ఆయన వ్యాఖ్యానించడం వంటి పరిణామాలు వైసీపీకి ఇప్పుడు ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. 

IHG


వైసిపి నాయకులంతా ఆయన ను టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున విమర్శలకు దిగారు. ఇదిలా ఉంటే అసలు రఘురామకృష్ణంరాజు ఏ ఉద్దేశంతో సొంత పార్టీపై విమర్శలు చేస్తున్నారనే విషయం ఎవరికీ అర్థం కాకుండా ఉంది. ఆయన ఇప్పుడు అకస్మాత్తుగా సొంత పార్టీని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేయడం వెనక, బ్యాంకు రుణాలు ఎగవేత వ్యవహారం ఉండటంతోనే బిజెపికి దగ్గరయ్యేందుకు ఈ విధంగా జగన్ పై విమర్శలు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం బీజేపీ కి, వైసీపీ కి మధ్య అందరూ అనుకున్నంత స్థాయిలో ను రాజకీయ వైరం లేదు. ఒక రకంగా కేంద్రంలోని బిజెపి ఏపీలో వైసీపీ సమర్థిస్తూ వస్తున్నట్టు కనిపిస్తోంది. చాలా విషయాల్లో జగన్ కు మద్దతు పలికారు. ఈ సమయంలో రఘురామకృష్ణంరాజు వైసీపీని ఎందుకు విమర్శిస్తున్నారో ఎవరికీ అంతుపట్టడం లేదు.


 బ్యాంకు రుణాలు ఎగవేత కేసు నుంచి తప్పించుకునేందుకు ఆయన వైసీపీ పై విమర్శలు చేస్తున్నారని రాజకీయ పండితులు అనుమానిస్తున్నారు. 2018 లోని రఘురామకృష్ణరాజు బ్యాంకు నోటీసులు అందాయి. దీని పై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీ వైసీపీలో కొనసాగినా పెద్దగా ప్రయోజనం ఉండదని బీజేపీ లో చేరితే  ఎన్నో అవకాశాలు కలుగుతాయని, కేసుల భయం ఉండదనే ఆలోచనతో ఇప్పుడు వైసీపీ పై రఘురామకృష్ణరాజు విమర్శలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తన వ్యాఖ్యలకు అధిష్టానం నొచ్చుకుని తప్పనిసరిగా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుందని అప్పుడు బీజేపీ లోకి వెళ్లినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే అభిప్రాయంతో రఘురామకృష్ణంరాజు ఉంటూ, ఇప్పుడు సొంత పార్టీ మీద విమర్శలు చేస్తూ అనేక సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: