మూడు రాజధానుల ముచ్చట ముగిసిపోయింది అని సంబరపడిన వారికి ఏపీ అసెంబ్లీ తాజాగా మరోమారు ఆమోదించిన అధికార వికేంద్రీకరణ బిల్లు షాక్ లాంటిదే. డిసెంబర్లో ఈ బిల్లు ఆమోదించి శాసనమండలికి పంపించారు. అయితే అక్కడ చుక్కుదురు అయింది. దాంతో ఏకంగా మండలి రద్దుకు వైసీపీ సర్కార్ సిఫార్స్ చేసింది. ఇక ఇపుడు చూసుకుంటే మళ్ళీ ఈ బిల్లుని రెండు రోజుల అసెంబ్లీలో జగన్ సర్కార్ ఆమోదించింది.

 

ఈసారి ఈ బిల్లు మళ్ళీ మండలికి వెళ్తుంది. ఈసారి తప్పనిసరిగా ఆమోదించాలేమో. లేదా ఈ ఆరు నెలల్లో జరిగిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో మండలిలో టీడీపీలో చీలిక కూడా వచ్చినట్లుగా చెబుతున్నారు. దాంతో అనూహ్యంగా మెజారిటీ వచ్చి బిల్లు ఆమోదం పొందే వీలు కూడా ఉందని అంటున్నారు.

 

మొత్తానికి చూసుకుంటే మూడు రాజధానుల విల్లు విషయంలో ఎక్కడా వెనక్కితగ్గకూడదని జగన్ సర్కార్ గట్టి పట్టుదల మీద ఉంది. అదే సమయంలో టీడీపీ కూడా తమకు పెద్దగా బలం లేని అసెంబ్లీని వదిలేసి శాసన‌మండలి మీదనే పూర్తిగా టార్గెట్ చేసింది. మండలిలో సేమ్ సీన్. మళ్ళీ  ఇపుడు కూడా  చైర్మన్ గా షరీఫ్ ఉన్నారు. ఆయన తాజాగా  ఏ నిర్ణయం తీసుకుంటారో కూడా చూడాలి.

 

ఇవన్నీ ఇలా ఉంటే ఈ బిల్లు విషయంలో వైసీపీ పూర్తి విశ్వాసంతో ఉండడమే ఇక్కడ విశేషం. ఈ బిల్లుని ఆమోదించుకోవాలని పట్టుదలగా ఉంది. ఎన్నిసార్లు అయినా, అసెంబ్లీలో ఆమోదించడానికి రెడీగా ఉంది. అలాగే శాసన‌మండలిలో ఆమోదం పొందేవరకూ కూడా చూడాలనుకుంటోంది. ఇక మండలిలో వైసీపీకి బలం వచ్చే ఏడాదికి వస్తుంది అంటున్నారు.

 

అందువల్ల విశాఖ రాజధాని అని గవర్నర్ తో చెప్పించారు. మూడు రాజధానుల విషయంలో ఎక్కడా తగ్గేది లేదని జగన్ సర్కార్ పూర్తి క్లారిటీతో ఉన్న తరువాత టీడీపీ ఎన్ని ఎత్తులు వేసినా చిత్తు అవుతాయనే చెప్పాలి. ఏది ఏమైనా అయితే ఇపుడు. లేకపోతే మరో ఆరు నెలలు అంతే. ఈ లోగా శానన‌మండలి రద్దు అయితే సరేసరి. ఏది ఏమైనా విశాఖకు రాజధాని షిఫ్ట్ గ్యారంటీ అంటున్నారు. దానికి సంబంధించిన సన్నాహాలు కూడా తొందరలోనే మొదలవుతాయని చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: