గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఏపీలో రాజకీయ పరిస్థితులు తమకు అనుకూలంగా మారాయని బీజేపీ అగ్ర నేతలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం టిడిపి ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వైసీపీలో ఉన్న అసంతృప్తులను తమ వైపు తిప్పుకుంటే వచ్చే ఎన్నికల నాటికి అధికార పీఠం దర్శించుకోవచ్చు అనే ఉద్దేశంతో బిజెపి ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీకి, లేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా బిజెపి వ్యవహరిస్తూ ఉండేది. దీని కారణంగా ఏపీలో బీజేపీకి బలం కూడా లేకపోయింది. ఇప్పటికీ  రాజకీయ ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ వైఖరి ఇదే విధంగా ఉంటే ఎప్పటికీ రాజకీయంగా ఏపీలో పై చేయి సాధించలేమనే ఉద్దేశంతో ఉన్న బీజేపీ అగ్రనేతలు ఇప్పుడు టిడిపి, వైసిపిని టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్లేందుకు సిద్ధమైనట్టు గా కనిపిస్తోంది. 

IHG


మొన్నటి వరకు వైసిపి ప్రభుత్వం లోని లోపాలు ప్రజావ్యతిరేక విధానాలపై తెలుగుదేశం పార్టీతో కలిసి బిజెపి పోరాడింది. దీంతో మళ్లీ బిజెపితో టిడిపి పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉందా అనే అనుమానాలు అందరికీ కలిగాయి. దీనికితోడు చంద్రబాబు సైతం బిజెపి నాయకులను పొగుడుతూ అనేక రకాలుగా పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే దానిని రాజకీయంగా చంద్రబాబు ఉపయోగించుకుని తమ ను పక్కన పెట్టేస్తారనే భావంతో ఉన్న బిజెపి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోకూడదు అనే నిర్ణయానికి వచ్చింది. అధికార పార్టీ వైసీపీ స్థాయిలో సమదూరం పాటించాలని, ఈ రెండు పార్టీలను టార్గెట్ చేసుకుని ఆ పార్టీలో ఉన్న అసంతృప్తులను తమ పార్టీలో చేర్చుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు కనిపిస్తోంది.

 


 ప్రస్తుతం నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు, ఆ తర్వాత మరికొంతమంది కీలక నాయకులను చేర్చుకుని వైసీపీకి ఝలక్ ఇవ్వాలని చూస్తోంది. వీరే కాకుండా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులను బీజేపీ వైపు తీసుకురావాలని, వారి రాజకీయ భవిష్యత్తు కి ఎటువంటి డోకా ఉండదనే భరోసా కల్పించి వైసీపీ, టీడీపీలను దెబ్బతీయాలనే విధంగా ఇప్పుడు బిజెపి ప్రయత్నిస్తోంది. పెద్ద ఎత్తున నాయకులను పార్టీలో చేర్చుకోవడం తో పాటు, అధికార పార్టీ పై ప్రజల్లో చులకన భావం ఏర్పడే విధంగా ప్రజా ఉద్యమాలు చేస్తూ, ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీ తామే అన్న స్థాయిలో రాజకీయాలు చేయాలనే విధంగా బిజెపి ప్లాన్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం బిజెపి దూకుడుతో వైసిపి, టిడిపి ఆందోళనలో ఉన్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: