కరోనా వల్ల ప్రజల తలసరి ఆదాయం తగ్గింది కానీ ఖర్చుల్లో మాత్రం తేడా లేదు.. ఎన్నిదారుల్లో దోపిడికి గురవ్వాలో అన్ని మార్గాల్లో సామాన్యులు దోపిడిపాలు అవుతున్నారు.. ఇకపోతే ఈ సంవత్సరం విద్యార్ధులు తీవ్రంగా నష్టపోతున్న విషయం తెలిసిందే.. దీన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ విద్యాసంస్దలు దోపిడికి తెరతీసాయి.. ప్రస్తుతం కరోనా వైరస్‌ తాకిడి వల్ల మిగతా విద్యాసంస్థలన్నీ మూతబడి ఉన్నా కొన్ని కాలేజీలు మాత్రం అప్పుడే ఒక్కో విద్యార్థి నుంచి రూ. 10 వేల చొప్పున అడ్వాన్స్‌లు వసూలు చేసి మరీ ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించేశాయట. ఈ పరిస్దితుల్లో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, సాధారణ జూనియర్‌ కాలేజీలు ఏం చేయాలో అర్థంకాక ఆందోళనలో పడ్డాయి..

 

 

ఇలాంటి సమయంలో ఇంటర్‌ తరగతుల ప్రారంభంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ కార్పొరేట్‌ కాలేజీలు ఆన్‌లైన్‌ పేరుతో పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతూ, భారీగా డబ్బు గుంజుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విడ్డూరం.. ఈ సమస్య ఒక కాలేజీ విద్యార్ధులదే కాదు.. స్కూలు స్దాయి పిల్లలు కూడా ఆన్‌లైన్ పాఠాల దోపిడికి గురవుతున్నారు.. ఎనిమిది గంటలు స్కూలుకు వెళ్లి చదివితేనే అంతంత మాత్రం చదివే వీరికి ఈ ఆన్‌లైన్ పాఠాలు ఎంత వరకు బోధపడతాయో తెలీయక తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారట..

 

 

ఇక కరోనా కారణంగా ఈసారి టెన్త్‌ విద్యార్థులందరినీ ప్రభుత్వం పరీక్షల్లేకుండానే పాస్‌ చేయగా కార్పొరేట్‌ కాలేజీలు మాత్రం తాము పెట్టే టెస్టులో టాప్‌ మార్కులు వచ్చిన వారికి ఫీజులో రాయితీ ఇస్తామంటూ పరీక్షలను నిర్వహిస్తుండటం చూస్తుంటే దోపిడి ఏస్దాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చూ.. మొత్తానికి కరోనా వల్ల ఈ సంవత్సరం చదువులు సాగకపోయినా తల్లిదండ్రులు మాత్రం పిల్లల పరంగా జేబులు ఖాళీ చేసుకుంటున్నారు.. మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తే బాగుంటుందనే అభిప్రాయం ప్రజల నుండి వినిపిస్తుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: