కరోనా కట్టడి చర్యలలో భాగంగా తమిళనాడులో మరోమారు లాక్ డౌన్ విధించను న్నారు. అయితే ఈ సారి రాష్ట్రం మొత్తం కాకుండా కరోనా వ్యప్తి ఉధృతంగా ఉన్న నాలుగు  జిల్లాలలో కంప్లీట్ లాక్ డౌన్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చెన్నై సహా నాలుగు జిల్లాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేయనుండటంతో చెన్నై పోలీసు సర్కిల్‌ పరిధిలోని ప్రాంతాల్లో నివసిస్తున్న బియ్యం రేషన్‌ కార్డుదారులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.1000 నగదును ఈనెల 22 నుంచి వారి ఇళ్ళ వద్దే పంపిణీ చేయనున్నట్ట్లు  ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వెల్లడించారు. లాక్‌డౌన్ సమయంలో ఆటోలు, టాక్సీలు, ప్రైవేట్ వాహనాలను అనుమతించరు. ఎమర్జెన్సీ ఐతే తప్ప ప్రైవేట్ వాహనాలను అనుమతించరు.

 

లాక్‌డౌన్ విధిస్తున్న ఈ నాలుగు జిల్లాల్లో నిబంధనలు మరింత కఠినతరం చేయాలని  సర్కారు నిర్ణయించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్న తరుణంలో తమిళనాడు ప్రభుత్వం అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకుంది.  దీంతో ఈనెల 19 నుంచి తిరిగి అన్ని మూతపడబోతున్నాయి.  మరి ఇదే బాటలో మిగతా రాష్ట్రాలు కూడా పయనిస్తాయా చూడాలి. ఇక లాక్ డౌన్ సమయంలో నగదు సాయాన్ని గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ పరిధిలో నివసిస్తున్న బియ్యం కార్డుదారులకు, తిరువళ్లూరు జిల్లాలో చెన్నై పోలీసు సర్కిల్‌ పరిధిలో ఉన్న తిరువళ్లూరు మునిసిపాలిటీ, గుమ్మిడిపూండి, పొన్నేరి, మీంజూరు నగర పంచాయతీలు, పూందమల్లి, ఈక్కాడు, చోళ వరం పట్టణపం చాయతీలకు చెందిన బియ్యం రేషన్‌ కార్డుదారులకు పంపిణీ చేస్తారు.

 

ఇక కాంచీపురం జిల్లాలో చెన్నై పోలీసు సర్కిల్‌ పరిధిలో ఉన్న ప్రాంతాలకు చెందిన కార్డుదారులకు రేషన్‌షాపుల్లో నగదు కానుకను పంపిణీ చేస్తామని  ముఖ్యమంత్రి తెలిపారు.  చెంగల్పట్టు జిల్లాల్లో చెన్నై పోలీసు సర్కిల్‌ పరిధిలో ఉన్న చెంగల్పట్టు, మరైమలర్‌నగర్‌ మున్సిపాలిటీలు, నందివరం, గూడువాంజేరి, కాట్టాన్‌కొళత్తూరు ప్రాంతాలకు చెందినవారికి అంద జేస్తారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: