ప్రపంచాన్ని మొత్తం గడగడలాడిస్తుంది కరోనా వైరస్. చైనాలో పుట్టిన ఈ వైర‌స్ ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ప్రాణాంత‌క‌ర వైర‌స్‌కు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. దీనిని క‌ట్ట‌డి చేయడం మ‌రింత క‌ష్టంగా మారింది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌పంచ‌దేశాలు క‌రోనాతో పోరాటం చేస్తూనే ఉన్నాయి. కానీ, రోజురోజుకీ కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నారు. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఆర్దికంగా చాలా కష్టాలలో మునిగిపోయారు.

 

 

మ‌రోవైపు ఉద్యోగుల‌పై క‌రోనా తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది. కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార సంస్థలూ కుదేలయ్యాయి. ఈ క్ర‌మంలోనే నష్టాలను పూడ్చుకోవడానికి, ఖర్చులను తగ్గించుకోవడానికి.. ఉద్యోగుల జీతాల్లో కోత పెట్ట‌డంతో పాటు.. ఉద్యోగులను సైతం తొలిగిస్తున్నాయి. అయితే ఇలాంటి స‌మ‌యంలో షనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఎన్‌టీపీసీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 100 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు ప్రకటనలో తెలిపారు.

 

 

దేశంలో ప్రముఖ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ) ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత కలిగినవారు అధికారిక వెబ్‌సైట్ ntpccareers.net ద్వారా జూలై 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలో వెల్లడించారు. గేట్‌-2020లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూకి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు వెల్లడించారు.

 

 

ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో మెకానికల్‌ ఇంజినీర్స్‌ విభాగంలో 45 పోస్టులు, ఎలక్ట్రికల్‌ విభాగంలో 30, ఎలక్ట్రానిక్స్‌ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీర్స్‌ విభాగంలో 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులు రూ.150లు దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు ఎలాంటి ఫీజు లేదని ప్రకటనలో పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: