చైనా మిడిసిపడుతోంది. తెంపరితనంతో రెచ్చిపోతోంది. బరితెగించింది. భారత్ మీదకు దూకుడుగా వస్తోంది. ప్రపంచానికి అధినేత అనిపించుకోవాలన్న పేరాశతో దురాశతో  ఉన్న చైనా తన కోరికలను ఎక్కడా దాచుకోవడంలేదు. అందుకే అణువుగా ఉందని భారత్ మీద విరుచుకుపడుతోంది. భారత్ మీద రెచ్చి మరీ రంకెలు వేస్తోంది.

 

1962లో భారత్ ని గెలిచాశామన్న సంబరం కాబోలు. అరవైఏళ్ళుగా ఆ గెలుపుని తలచుకుంటూ భారత్ తన ముందు బలాదూర్ అనుకుంటుంది కాబోలు. అయితే వియత్నాం వంటి చిన్న దేశం పౌరుషం ముందు తోక ముడిచిన చరిత్రను ఒకసారి చైనా గుర్తు చేసుకోవడం మంచిదేమో. ఇక భారత్ లో చూసుకుంటే జాతీయ భావాలు ఉన్న బీజేపీ నాయకత్వం అధికా‌రంలో
ఉంది.

 

మోడీ వండి గండర గండడు ప్రధానిగా ఉన్నాడు. మరో వైపు తన దేశం నుంచి కరోనా వైరస్ ని వ్యాప్తి చెందించిన చైనా అంటే ప్రపంచంలోని మెజారిటీ దేశాలు చీ కొడుతున్నాయి. అయినా చైనా తెగించి భారత్ మీద పడింది  అంటే చైనాకు గట్టి దెబ్బ పడాల్సిందే. చైనాకు తాను కోరుకున్న  కాండు జెల్ల తగలాల్సిందే.

 

భారత్ కనుక సరేనని యుధ్ధానికి సిధ్ధపడితె  డ్రాగాన్ ఆటకట్టు అవుతుంది. అంతే కాదు సై అంటూ భారత సైనికులు కాలు దువ్వితే చైనా డేరింగ్ డేషింగ్ ఎక్కడో ఎగిరిపడతాయి. సరిహద్దుల్లో భూభాగాలను ఆక్రమించుకుంటూ దందా చేస్తున్న అతి పెద్ద కబ్జాకోరు దేశం ఆట కట్టు అవుతుంది.

 

చైనా కూడా దాని కోసమే ఈ పూనకాలు పోతోంది. దానికి తగిన మందు భారత్ సిధ్ధం చేసి ఉంచింది. ఈ దెబ్బకు కరోనా వైరస్ తో పాటు దాన్ని అమ్మ కూడా దిగి వచ్చేలా మోడీ గట్టి షాకే ఇస్తారు. తగిన గుణపాఠమే చైనా నేర్చుకుంటుంది. 1962 తరువాత తగిన గుణపాఠం కూడా చైనా నేర్చుకుని ఓటమి భారంతో సరిహద్దుల నుంచి మూటాముల్లే సర్దుకుంటుంది. దానికి తగ్గ యాక్షన్ ప్లానే ఇపుడు కేంద్రం రెడీ చేసిపెట్టుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: