తెలంగాణ లో కరోనా వీర విహారం చేస్తుంది. ఇన్నిరోజులు కొన్ని జిల్లాలకే పరిమితమైన ఈ మహమ్మారి మెల్లి మెల్లిగా  అన్ని జిల్లాలకు విస్తరిస్తుంది. అందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి లో ఈ రోజు ఓ పాజిటివ్ కేసు నమోదైయింది. ఇక వరంగల్ లో కరోనా అంతకంతకు పెరుగుతుంది. అర్బన్ లో ఈరోజు కొత్తగా 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అయితే రూరల్ లో మాత్రం కొత్తగా కేసులు ఏమి నమోదు కాకపోవడం ఊరటనిచ్చే విషయం అలాగే కరీంనగర్ లో నిన్న 6 కేసులు నమోదు కాగా తాజాగా మరో ఎనిమిది కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు ఈరోజు జనగామ లో 5,ములుగు లో 5కేసులు నమోదయ్యాయి.
 
ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్క రోజే 269 కేసులు నమోదు కాగా ఒక్క జిహెచ్ఎంసి లోనే 214కేసులు బయటపడ్డాయి. అయితే నిన్నటి తో పోలిస్తే  ఈరోజు టెస్టుల సంఖ్య తగ్గింది. ఈరోజు మొత్తం 1096 శాంపిల్ టెస్టులు మాత్రమే జరిగాయి. మరోవైపు టెస్టులు తక్కువ చేస్తుండడంతో హైకోర్టు ,రాష్ట్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
ఇక ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 5675 కరోనా కేసులు నమోదవ్వగా అందులో 3071మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 2412కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఈరోజు కరోనా తో ఒకరు మరణించడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 192కు చేరింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: