తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతూనే వుంది. ఈరోజు ఏకంగా రికార్డు స్థాయిలో 2174కేసులు నమోదు కాగా రాష్ట్ర వ్యాప్తంగా 48 మంది కరోనాతో మరణించారని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈమరణాలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 576కు చేరింది. మరోవైపు మొత్తం కరోనా కేసుల సంఖ్య 50103కు చేరింది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో ఈనెల 19నుండి 31 వరకు చెన్నై సహా మరో మూడు జిలాల్లో పూర్తి లాక్ డౌన్ అమల్లోకి రానుంది. 
 
ఇక మరో దక్షిణాది రాష్ట్రం కేరళలో ఈరోజు 75 కరోనా కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈకొత్త కేసులతో కలిపి కేరళ లో ఇప్పటివరకు మొత్తం 2697కేసులు నమోదుకాగా అందులో 1351కేసులు యాక్టీవ్ గా వున్నాయి.కాగా 1324మంది బాధితులు కరోనా నుండి కోలుకోగా ఇప్పటివరకు 20మంది కరోనాతో మృతిచెందారు.
ఇదిలావుంటే ఈరోజు దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదు కావడంతో ఈఒక్క రోజే  కరోనా కేసుల సంఖ్య 12000 దాటింది. ఓవరాల్ గా ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 366000 కు చేరగా 11500మరణాలు చోటుచేసుకున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: