వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో నడుస్తున్న ఏపీ సర్కారు ఇప్పటికే విపరీతమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కరోనా కారణంగా విధించబడిన లాక్ డౌన్ వల్ల బడ్జెట్ సమావేశాలు మూడు నెలలు వాయిదా పడగా చివరికి ఎలాగోలాగా రెండు రోజులకు సమావేశాలను కుదించి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ను విడుదల చేసింది. హమ్మయ్య ఇక్కడితో ఒక పని అయిపోయింది.. ఇక నుండి ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకునేందుకు చర్యలు చేపట్టవచ్చు అనుకుంటున్న సమయంలో మరొక అడ్డంకి వచ్చిపడింది.

 

నేడు శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు వైసీపీ పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగి మండలి నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. రాజధాని వికేంద్రీకరణ బిల్లును మరియు సీఆర్డిఏ బిల్లును ప్రవేశపెట్టిన జగన్ ప్రభుత్వం పై టిడిపి నాయకులు మండిపడ్డారు. అసలు సెలెక్ట్ కమిటీ కి వెళ్ళిన బిల్లులను మరియు హైకోర్టులో పెండింగ్ లో ఉన్న బిల్లులను మళ్లీ చట్టసభల్లో ఎలా ప్రవేశపెట్టి ఆమోదిస్తారని వారు ప్రశ్నించారు.

 

అయితే లోపల రాష్ట్ర బడ్జెట్ కు సంబంధించిన వినియోగత బిల్లు (appropriation) బిల్లును మండలిలో ఆమోదించనిదే ఖజానా నుండి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసేందుకు వీలు లేదు. అయితే జూలై 1 తారీఖున కదా జీతాలు వేసేది…. లోపు ఎప్పుడైనా బిల్లుని ఆమోదిస్తే సరిపోతుంది అనుకుంటే పొరపాటే. ఇదే బిల్లు మండలి లో ప్రవేశపెట్టిన తర్వాత అనుకున్న సమయానికి దానిని ఆమోదించకపోతే వచ్చేనెల ప్రభుత్వం జీతాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా నుండి ఒక్క రూపాయి కూడా లభించదు. ఇక తర్వాత ప్రక్రియ మరింత క్లిష్టం అయి రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడతారు.

 

సరే ప్రజలను దృష్టిలో ఉంచుకొని ముందుఈ అప్రాప్రియేషన్ బిల్లును వాదనకు తీసుకొని వద్దామని ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు మండలిలో ప్రతిపాదించినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ముందు నిన్నటి రోజున ప్రవేశపెట్టిన (రాజధాని వికేంద్రీకరణ బిల్లును మరియు సీఆర్డిఏ) బిల్లులను ఆమోదించనిదే బిల్లు కదలదు అని అడ్డుకట్ట వేయడం జరిగింది. ఇది నిజంగా సంచలన నిర్ణయమే అసలు జగన్ మోహన్ రెడ్డి ఇలా ఈ రెండు బిల్లుల పై పట్టు పట్టి ఒక సంచలనానికి తెర లేపారడు అనే చెప్పాలి. దీని వెనుక వైసీపీ ఆంతర్యం మరియు వ్యూహం ఏమిటో వారికే తెలియాలి.

 

మొత్తం 58 మంది ఉన్న మండలిలో.... 28 మంది టిడిపి సభ్యులు ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 12 మంది మాత్రమే ఉన్నారు. మిగతా 12 మంది బిజెపి, ఐఎన్డి మరియు పిడిఎఫ్ వారు ఉన్నారు. ఇలా రాజధాని వికేంద్రీకరణ బిల్లు మరియు సీఆర్డీఏ బిల్లును టిడిపి వారు ఎలాగూ ఆమోదించరు కాబట్టి ఇప్పుడు బడ్జెట్ వినియోగ బిల్లును 14 రోజుల లోపల ఆమోదించకపోతే ప్రభుత్వం వారు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: