నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు గత కొద్దిరోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్. తన సొంత పార్టీపైనే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ తీవ్ర దుమారం రేపిన ఈయన అజెండా ఏమిటో మొదట్లో ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పటికే పెద్దఎత్తున టిడిపి నాయకులను చేర్చుకుంటూ మంచి ఊపులో వెళ్తున్న వైసీపీకి రఘురామకృష్ణంరాజు వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది.

 

వైసిపి అగ్రనేతలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిన ఈయన జగన్ చుట్టూ కోటరీ ఉందని అది దాటుకుని వెళ్లడం కష్టమని చెప్పిన ఆయన వైసీపీలో కుల రాజకీయాలు ఉన్నాయంటూ పరోక్ష విమర్శలు చేసిన విషయం తెలిసిందే. జగన్ అపాయింట్మెంట్ ఇవ్వని కారణంగానే ఇలా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పిన ఆయన విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి లను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన విపరీతమైన విమర్శలు చూసి ఇక ఈయనకు జన్మలో జగన్ అపాయింట్మెంట్ దొరకదు అని అందరూ అనుకున్నారు.

 

అయితే అసలు కృష్ణంరాజుగారి  గురి వేరొక చోట ఉంది అని ఇప్పుడు నెమ్మదిగా అర్థం అవుతోంది. ఆయన బీజేపీ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని.... దానికోసమే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని అనుమానాలు కలుగుతున్నాయి. ఇక వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వంటి వారు రఘురామకృష్ణరాజు కాస్త తేడా మనిషి అని, పట్టించుకోనవసరం లేదు అంటూ విమర్శించారు.

 

వార్ ఇలా జరుగుతుండగానే రఘు రామకృష్ణంరాజు కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో రాజకీయాలు హీటెక్కిన సమయంలో బిజెపి విధంగా తెరవెనుక ఉండి రఘురామకృష్ణంరాజుతో విధంగా వ్యాఖ్యలు చేయిస్తుందా అనే అనుమానం అందరిలోనూ ఇప్పుడు కలుగుతోంది. ఏదేమైనా అయానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రాగా…. రాజుగారు చివరికి అనుకున్నది సాధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: